సినిమాల నుండి రాజకీయ రంగప్రవేశం చేసిన కమల్ హాసన్ మక్కల్ నీదిమయ్యం పార్టీ ని స్థాపించి ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి , ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ అంటే సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్ అని అర్థం.ఇక వచ్చే ఏడాది లో తమిళనాడు లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక్కొక్కరిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ విజయం దిశగా సాగిపోతుంది. ఇక డీఎంకే , ఏడిఎంకె , కాంగ్రెస్ తో పలు పార్టీలు విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ మక్కల్ నీదిమయ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల దగ్గర పడేకొద్ది , రాష్ట్రంలో పొత్తులపై కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ మాట్లాడుతూ ... మక్కల్ నీదిమయ్యం పార్టీ పొత్తు డైరెక్ట్ ప్రజలతోనే అని ,ప్రజలతోనే తమ కూటమి ఉంటుంది అని తెలియజేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ సమావేశం అయింది. కమల్ అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో జిల్లా స్థాయి నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు తప్పనిసరిగా కరోనా నిరోధక నిబంధనలు పాటించాలని, సమావేశం జరిగే ప్రాంతానికి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకు రాకూడదని కమల్‌హాసన్ ఆంక్షలు విధించారు. కరోనా సోకిన వారెవరూ సమావేశాలకు హాజరుకాకూడదని కూడా హెచ్చరించారు.
ఇక , మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అన్ని హంగులతో ఎరుపురంగు ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. జిల్లా కార్యదర్శుల సమావేశం ఏర్పాటైన స్టార్ హోటల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన కమల్ ప్రచార రథం అందరినీ
విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రచార వ్యాన్ లో కమల్ ప్రచారం చేయడానికి వీలుగా లోపల నుంచి వ్యాన్ మీదికి పైకి వచ్చేలా పుష్ బటన్ లిఫ్టు సదుపాయం ఉంది. వ్యాన్‌లోపల కమల్ విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ కూడా ఉంది. ఈ వ్యాన్ పై ‘మక్కల్ నీదిమయ్యం వికసించడానికి ఇదే మంచి తరుణం’ అనే నినాదాన్ని తెల్లటి పెయింట్‌తో రాసి ఉంది. వ్యాన్ పైభాగాన ‘తలెత్తుకునేలా తమిళనాడు’ అనే నినాదం కూడా రాసి ఉంది. ఈ ప్రచార రథం ద్వారానే కమల్‌హాసన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి త్వరలో బయలుదేరి వెళతారని పార్టీ ప్రముఖడు తెలిపారు.