కమల్ హాసన్ సంచలనం.. అసెంబ్లీకి రెడీ

Update: 2019-04-27 08:28 GMT
తమిళనాట ఎంపీ ఎన్నికల పోరు ముగిసిపోయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిందే.. కానీ మధ్యలో ఉప ఎన్నికలు వచ్చాయి. అరవకురిచ్చి, సూళూర్, ఒట్టిపిడారం, తిరుప్పరకుండ్రం మొదలగు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని అధికార అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ప్రధాన పక్షాలతోపాటు దినకరణ్ పార్టీ, చిన్న పార్టీలు కూడా పోటీపడుతున్నాయి.

తాజాగా తమిళనాట ఉప ఎన్నికల పోరులోకి స్టార్ హీరో, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ బరిలోకి దిగుతున్నారు. తాజాగా శనివారం తమ పార్టీ తరుఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీని గురించి కమల్ హాసన్ పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇటీవలే తమిళనాడులోని 40 లోక్ సభ స్థానాల ఎన్నికలకు కమల్ హాసన్ పార్టీ పోటీచేసింది. తీవ్రంగా కష్టపడి ప్రచారం చేశాడు. ఇప్పుడే అదే స్థాయిలో ఈ నాలుగు ఉప ఎన్నికల్లో కూడా ప్రచారానికి కమల్ హాసన్ సిద్ధం అవుతున్నారు.

తాజాగా కమల్ హాసన్ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళి, గెలుపు, ఇతర సమస్యలపై అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు శాసన సభ ఉప ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి.. పొరపాట్లకు తావులేకుండా  ఏం చేయాలనే దానిపై చర్చించారు. నాలుగు స్థానాలను చేజిక్కించుకునేందుకు కమల్ హాసన్ వ్యూహాలు రెడీ చేస్తున్నారు.
    

Tags:    

Similar News