లోకనాయకుడిగా విలక్షణమైన ఇమేజ్ ఉన్న కమల్ హాసన్.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. జల్లికట్టు మొదలుకొని.. ఈ మధ్య కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించటం.. తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పేయటం పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇటీవల కాలంలోకమల్ పెడుతున్న పోస్ట్ లకు ఆదరణ లభించటమే కాదు.. సోషల్ మీడియాలో ఆయన సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇలాంటివేళ.. వివాదాస్పద నేత.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కమల్ పైఅనూహ్య వ్యాఖ్యలు చేశారు.
సతీశ్ రాజారామ్ అనే వ్యక్తి.. స్వామితో ట్విట్టర్ లో సంభాషిస్తూ.. కమల్ హాసన్ బీజేపీలో చేరి తనకు నచ్చినట్లుగా ప్రభుత్వాన్ని పాలిస్తే మీరు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి స్వామి బదులిస్తూ.. బీజేపీ గురించి తనకు తెలీదు కానీ.. తాను మాత్రం బోన్ లెస్ వండర్.. ఇడియట్ లాంటి కమల్ హాసన్ ను రానివ్వనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా వివాదాలకు స్వామి కేరాఫ్ అడ్రస్ గా నిలవటం కొత్తేం కాదు.
దీనికి రియాక్ట్ అయిన కమల్ హాసన్ మాత్రం.. ‘‘ఆయన చేసిన వ్యాఖ్యకు ప్రతి వ్యాఖ్య చేయను. తిట్టేయను. రాజకీయాల్లో నాకంటే ఆయనకే అనుభవం ఉంది. ఆయనకు బోన్ లెస్ మీల్ అంటే ఇష్టమేమో కానీ నాకు మాత్రం నచ్చదు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. తనకు కౌంటర్ ఇచ్చిన కమల్ ను స్వామి అంత త్వరగా వదిలేస్తారా? లేక.. మరిన్ని వార్తలకు కేంద్రంగా మారతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/