తమిళనాడు రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు తెర లేపుతూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నేటి ఉదయం తన రాజకీయ రంగ ప్రవేశంపై ఘనంగా ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూనే తనదైన శైలిలో స్పిరిచ్చువల్ పాలిటిక్స్ అంటూ కొత్త పదాలు వాడేసిన రజనీ.. మొత్తానికి రాజకీయాల్లో తన భవిష్యత్తును పరీక్షించుకునేందుకే సిద్ధమన్నట్లుగా ప్రకటన చేశారు. రజనీ ప్రకటనతో ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడ్డ రాజకీయ శూన్యతకు ఇక చెప్ పడినట్టేనన్న వాదన కూడా తమిళ తంబీల్లో వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే జయ మరణంతో నెలకొన్న రాజకీయ శూన్యతకు చెక్ చెప్పేందుకంటూ మొన్న నానా హడావిడి చేసిన విలక్షణ నటుడు కమల్ హాసన్... మొన్నామధ ఏకంగా పార్టీని కూడా ప్రకటించారు. పార్టీ నిర్వహణ కోసమంటూ చందాలూ వసూలు చేశారు. అయితే ఏమైందో తెలియదు గానీ... ఇప్పుడు ఆయన అస్సలు రాజకీయాల గురించి మాట్లాడేందుకు కాదు కదా.. తన సినిమాల గురించి కూడా మాట్లాడేందుకు మీడియా ముందుకు రావడం లేదు. కమల్ మీడియాకు ముఖం చాటేయడానికి చాలా కారణాలే ఉన్నాయని వినిపిస్తున్నా... రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన వెలువడ్డ మరుక్షణమే కమల్ రీ ఎంట్రీ ఇచ్చారు.
రజనీ ప్రకటన వెలువడిన మరుక్షణమే... సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయని కమల్.... రజనీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లుగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా చాలా వేగంగా స్పందించారు. సింగిల్ ట్వీట్ ద్వారానే రజనీకి స్వాగతం పలికేసిన కమల్.... అసలు రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై తాను ఎంత ఆసక్తిగా ఉన్నాననే విషయాన్ని ఇట్టే బయటపెట్టేశారు. అయినా సదరు ట్వీట్ లో కమల్ ఎమన్నారన్న విషయానికి వస్తే.. *గ్రీటింగ్స్ బ్రదర్ రజనీ. మీ సామాజిక స్పృహ - రాజకీయ రంగ ప్రవేశానికి స్వాగతం. సుస్వాగతం.* మొత్తంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై రజనీ సంచలన ప్రకటన చేస్తే.. ఆ ప్రకటనను స్వాగతిస్తూ కమల్ వెనువెంటనే స్పందించేసి మరింత ఆసక్తి రేకెత్తించారనే చెప్పాలి.