సరిగ్గా సర్వేలను నిర్వహిస్తే తన పార్టీకి ఉన్న రాజకీయ బలం ఏమిటో తేలుతుందని చెప్పుకొచ్చారు నటుడు కమల్ హాసన్. ఇటీవలే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడులో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని పోటీలో పెట్టిన కమల్ ఇప్పుడు ప్రచార పర్వంలో ఉన్నాడు. తమిళనాట తిరుగుతూ తన పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..తన పార్టీకి ప్రజల్లో బలం ఉందన్నారు.
సరిగ్గా సర్వేలు చేస్తే ఆ బలం ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి సర్వేలను ఎవరూ చేయరని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ చానళ్లు ఉన్నాయని.. అవి ఆయా పార్టీలే బలంగా ఉన్నాయని సర్వేలను వెల్లడిస్తాయని, తమ పార్టీకి అలాంటి మీడియా ఏదీ లేదని కాబట్టి తమ బలం ఏమిటో ఎవరూ చెప్పరని కమల్ అన్నారు.
తన పార్టీ అభ్యర్థులు చక్కగా పని చేయాలని కమల్ సూచించారు. ఒకవేళ ఎవరికైనా చేసే పని ఇష్టం లేకపోతే తప్పుకోవాలని కమల్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక ప్రభుత్వ విధానాల మీద, స్త్రీల మీద జరుగుతున్న లైంగిక దాడుల మీద కమల్ స్పందించారు. వాటిని ఖండిస్తూ నివారించాలని అన్నారు.
అయినా సర్వేల విషయంలో కమల్ హాసన్ మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదేమో. ఏ రాజకీయ పార్టీ అయినా సర్వేల్లో గెలిస్తే సరిపోదు కదా, పోలింగ్ అనంతరం ఫలితాల్లో గెలవాలి. అప్పుడు ఏ పార్టీ బలం అయిన బయటపడుతుంది. కమల్ అక్కడ సత్తా చూపించేందుకు రెడీగా ఉన్నట్టేనా?