పార్టీ ఎత్తేస్తానంటూ కమల్ హాసన్ హెచ్చరిక

Update: 2020-08-15 08:10 GMT
ఎన్నో ఆశయాలు.. లక్ష్యాలతో పార్టీని స్థాపించాను.. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే పార్టీని ఎత్తేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు.. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కార్యకర్తలను హెచ్చరించారు. తాజాగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఇక నుంచి పార్టీ ఆశయాలు.. లక్ష్యాలను పార్టీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచాలని నిర్ణయించామని కమల్ హాసన్ తెలిపారు. మొత్తం 37 అంశాలపై చర్చించామన్నారు. కేంద్రం విధానాలు.. రాష్ట్ర అవసరాలు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల అంశాలపై పార్టీ నిర్ణయాలను ఆయన వివరించారు. హిందూ వ్యతిరేక పార్టీ అనే దుష్ప్రచారాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించారు.

పార్టీ విధానాలు ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే వాటిపై మీకు పూర్తి అవగాహన ఉండాలని కమల్ హాసన్ సూచించారు. నిర్వాహకులపై నిఘా పెట్టి ఉంచానని.. పార్టీ నిర్వహణలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదన్నారు. నిర్వాహకుల వల్ల ఏదైనా ఆటంకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటాను. పార్టీ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్నానని కమల్ హాసన్ ఎమోషనల్ అయ్యారు.
Tags:    

Similar News