క‌మ‌ల్ కామెంట్ల‌పై హోం మంత్రి ఫైర్‌

Update: 2017-11-06 16:25 GMT
హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించాల్సిందేనని సంచ‌ల‌న కామెంట్లు చేసిన సినీ న‌టుడు, కాబోయే రాజ‌కీయ‌వేత్త‌(!) క‌మ‌ల్ హ‌స‌న్‌ పై బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో కేసులు కూడా న‌మోదు అవుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ పై తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. క‌మ‌ల్ హాస‌న్ కామెంట్ల‌ను ఖండిస్తున్నాన‌ని హోం మంత్రి తెలిపారు.

ఢిల్లీలో ఓ మీడియా సంస్థ‌తో హోంమంత్రి ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఉగ్ర‌వాదాన్ని త‌మ ప్ర‌భుత్వం ఏ రూపంలో ఉన్నా అణిచివేస్తోంద‌ని తెలిపారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్ హ‌స‌న్ త‌న పొలిటిక‌ల్ మైలేజీ కోసం ఇలాంటి కామెంట్లు చేయ‌డం స‌రికాద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు విడుద‌ల‌కు ముందే వివాదాల్లో చిక్కుకున్న ప‌ద్మావ‌తి సినిమాపై సైతం కేంద్ర హోం మంత్రి స్పందించారు. ఈ సినిమాపై ప‌లువ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో...స‌ద‌రు విమ‌ర్శ‌లు స‌రికావ‌ని..చిత్ర బృందం నిరూపించుకోవాల‌ని హోం మంత్రి సూచించారు.

మ‌రోవైపు హిందు ఉగ్రవాదం పెరిగిపోతున్నదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఐపీసీ సెక్షన్ 500 - 511 - 298. 295(ఏ) - 505(సీ) కింద కేసు బుక్ చేశారు. కమల్ మరో హఫీజ్ సయీద్.. అతనివి చిల్లర రాజకీయాలని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు మండిప‌డ్డారు. ``గ‌తంలో కాంగ్రెస్ నేతలు చిదంబరం - సుశీల్‌ కుమార్ షిండే ముస్లిం ఓట్ల కోసం దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని పార్లమెంట్‌ లోనే చెప్పారు. ఇప్పుడు కమల్‌ హాసన్ అలాంటి కామెంట్సే చేశాడు. ఈ వ్యాఖ్యలతో అతడు చిదంబరం - హఫీజ్ సయీద్ సరసన నిలుస్తున్నాడు.ఇలాంటి చిల్లర రాజకీయాలను తమిళ ప్రజలు తిప్పికొడతారు `అని నరసింహారావు స్పష్టంచేశారు. కాగా,  కమల్‌ కు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మద్దతు తెలిపారు. సూటిగా పలు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ...అస‌లు ఏది ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం అంటూ నిల‌దీశాడు. త‌ద్వారా ప‌రోక్షంగా క‌మల్ కామెంట్ల‌కు సంఘీభావం తెలిపాడు.
Tags:    

Similar News