రాజకీయాలకు కమల్ నాథ్ గుడ్ బై?

Update: 2020-12-15 00:30 GMT
దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ ఆనవాళ్లు కోల్పోతోంది. 100 ఏళ్ల పార్టీ.. కొన్ని సంవత్సరాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ.. బీజేపీ దెబ్బకు రెండు సార్లు అధికారంలోకి దూరమై.. అసలు కనీసం పోటీ ఇవ్వలేని దుస్థితికి దేశంలో చేరుకుంటోంది. ఈ వైరాగ్యానికి కాంగ్రెస్ లోని సీనియర్లే కారణమన్న వారు లేకపోలేదు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ దిగ్గజ సీనియర్ నేత.. గాంధీల కుటుంబానికి విశ్వాసపాత్రుడైన మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. రాజకీయ చదరంగంలో అత్యంత చురుకైన నేతగా పేరున్న కమల్ నాథ్ ఇక అలిసిపోయారని అంటున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్ లోని ఛింద్ వాడలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇక నేను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నా.. కావాల్సిన పదవులన్నీ అనుభవించా.. ఇక నాకు విశ్రాంతి అవసరం’ అని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ మాట రాజకీయ అలజడి రేపింది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ శాసనసభాపక్ష నేతతోపాటు పీసీసీ చీఫ్ గా కమల్ నాథ్ ఉన్నారు.ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఓడిపోతారని తెలిసిన అభ్యర్థులకే కమల్ నాథ్ టికెట్లు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News