దమ్ముంటే కూల్చండన్న కాంగ్రెస్ - నో అంటున్న బీజేపీ!

Update: 2019-07-01 05:17 GMT
'పదే పదే హెచ్చరించడం కాదు.. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని కూల్చండి..' అంటూ సవాల్ విసిరారు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. బోటాబోటీ మెజారిటీతో ఉన్న మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారును కూల్చాని కమల్ నాథ్ బీజేపీకి సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మనుగడ దినదినగండంగానే ఉంది. మధ్య ప్రదేశ్ లో లోక్ సభ  సీట్లను బీజేపీ దాదాపుగా స్వీప్ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయక్కడ. అందులోనూ అక్కడ కాంగ్రెస్ సర్కారుకు ఉన్న బలం అంతంత మాత్రమే. మెజారిటీ పెద్దగా లేదు. దీంతో ప్రభుత్వాన్ని కూల్చడం విషయంలో బీజేపీ వాళ్లు పలుసార్లు మాట్లాడారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి క్రమంలో కమల్ నాథ్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని - పదే పదే మాటలు వద్దని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై మధ్యప్రదేశ్  బీజేపీ చీఫ్ స్పందించారు.

కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ఏదీ తమకు లేదని ఆయన ప్రకటించారు. ఆ విషయంలో కాంగ్రెస్ వాళ్లు నిశ్చింతగా ఉండవచ్చని - ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని తాము అనుకోవడం లేదని కమలం పార్టీ వాళ్లు అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ ఊరటేనా?
Tags:    

Similar News