అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. అయితే , అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు ముగిసి కొన్ని నెలలే కదా అప్పుడే అధ్యక్షుడి మార్పేంటి అని ఆలోచిస్తున్నారా ? అధ్యక్షడి మార్పు ఖాయం కానీ అదే శాశ్వత నిర్ణయం కాదు. తాత్కాలికంగా కొంత కాలం పాటు మాత్రమే. జో బిడెన్ తన అధికారాలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించనున్నారు. కమల హారిస్ ఈ అధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. కమలా హ్యారిస్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోన్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొలనోస్కోపీ కోసం శుక్రవారం అనస్థీషియా తీసుకున్నారు. కొలనోస్కోపీ చికిత్స సమయంలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని జో బిడెన్ కు వైద్యులు చెప్పారు. దీనితో తన అధ్యక్ష బాధ్యతలను ఆ సమయం వరకు కమలా హ్యారిస్ కు అప్పగించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కమలా హ్యారిస్ ఆ సమయంలో వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ లో ఉన్న తన కార్యాలయం నుంచే పనిచేశారు. 250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన దాఖలాలు లేవు.
దీనితో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ కూడా ధృవీకరించారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వహించే పరిస్థితిలో లేకపోతే తన అధికారాలను మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగానే ఆ కొంత సమయం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్ కొనసాగారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు. జో బైడెన్ ఈ శనివారం 79వ ఏట అడుగుపెట్టనున్నారు.