కమలకు శుభాకాంక్షలు.. అమెరికాకు పంచ్ వేసిన ప్రియాంక

Update: 2020-11-20 11:30 GMT
అభినందిస్తూనే..పంచ్ వేసే సత్తా అందరికి సాధ్యం కాదు. వరుస పరాజయాలతో పార్టీ ఏ దిశకు వెళుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రధాని మోడీ మాదిరి దేశ ప్రజల మనసుల్ని దోచే తీరు కాంగ్రెస్ పార్టీలో అంతకంతకూ తగ్గిపోతుందన్న విమర్శ పెరుగుతోంది. ఆ మధ్య వరకు ప్రియాంక వాద్రా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ అవేమీ వర్కువుట్ కాని పరిస్థితి.

ఇలాంటివేళలో తాజాగా ఒక ట్వీట్ చేసిన ఆమె.. తనలోనూ కాస్తంత విషయం ఉందన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హ్యరిస్ కు ప్రపంచ వ్యాప్తంగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. వివిధ దేశాధినేతలు అధ్యక్షుడు బైడెన్ కు.. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలకు అభినందనలు తెలుపుతున్నారు.

మిగిలిన వారికి కాస్తంత భిన్నమైన పోస్టు పెట్టారు ప్రియాంక గాంధీ. కమలా హ్యారిస్ కు కంగ్రాట్స్ చెప్పిన ఆమె.. అగ్రరాజ్యమైన అమెరికాకు పంచ్ వేవారు. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఒక మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు శతాబ్దాల సమయం పట్టిందని.. భారత్ లో మాత్రం 50 ఏళ్ల క్రితమే ఒక మహిళను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారంటూ తన నానమ్మ ఇందిరాగాంధీ గురించి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నానమ్మ ఇందిరతో తాను దిగిన ఫోటోను షేర్ చేవారు. యాభైఏళ్ల కిందటనే ఇందిరను ప్రధానిగా ఎన్నుకున్న దేశ పరజలు ఎంతో గొప్పవారని కొనియాడిన ఆమె.. ఈ ఘనతను సాధించేందుకు అమెరికాకు శతాబ్దాల సమయం పట్టిందంటూ పోస్టు రూపంలో పంచ్ వేశారు
Tags:    

Similar News