తెలుగుదేశం పార్టీ- భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కటీఫ్ అయింది. అయితే ఇలా బంధం తెగిపోవడానికి బాధ్యులెవరు?. ఎవరైనా కుట్ర చేస్తే మీ బంధం తెగిందా. అసలు వీరిద్దరి మధ్య బంధం తెగడానికి ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉందా. మనం భారతీయ జనతా పార్టీ నాయకుడు కంభంపాటి హరిబాబు మాత్రం ఇవి జగన్ కుట్ర అనేస్తున్నారు. పాపం.. రాష్ట్రం మొత్తం తమ పార్టీ పరువు పోతున్న సమయంలో.. కమలనాధులకు ఎవరి మీద నింద వేయాలో.. ఎవరికి తాటాకులు కట్టాలో.. క్లారిటీ లేకుండా పోతున్నట్లుంది.
ఒక వైపు చంద్రబాబు మాత్రం.. జగన్- భాజపా కలిసి కుట్ర చేస్తున్నాయని.. తాము ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాయని అంటారు. అదే సమయంలో.. మరోపక్క పవన్ కల్యాణ్ ను కూడా భాజపా కీ ఇస్తే కదిలే బొమ్మలాగా అభివర్ణిస్తారు. ఈ చంద్ర విమర్శలకు కౌంటర్ ఇవ్వడమే లక్ష్యం అన్నట్లుగా.. జగన్ - పవన్ ల వెనుక భాజపా లేదంటూ... రాష్ట్ర అధ్యక్షుడు వివరణ ఇచ్చుకుంటున్నారు.
అంతటితో ఆగితే తమను ఎవ్వరూ నమ్మరు అని కంభంపాటి హరిబాబుకే డౌటు వచ్చేసినట్లుంది. అందుకే ఆయన.. ఇంకాస్త స్ట్రాంగు గా ఆరోపణ ఉండేలాగా.. అసలు కుట్ర చేసింది జగన్ ... ఆయన కుట్ర చేసి.. ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లిపోయేలా చేశారు అని అంటున్నారు.
ఇంతకూ వారిద్దరూ ఎలా కలిసి ఉంటే మాత్రం జగన్ కు వచ్చిననష్టమేంటి? ఆయన ఎందుకు చేస్తారు? అనే ప్రశ్నలకు కంభంపాటి వద్ద జవాబు లేదు గానీ.. ఎలా జగన్ కుట్ర చేశారో మాత్రం చెబుతున్నారు. జగన్- పనిగట్టుకుని.. చంద్రబాబును రెచ్చగొట్టారుట. అందుకే చంద్రబాబు కటీఫ్ చెప్పారుట. అయినా నాలుగేళ్లుగా రెచ్చగొడుతోంటే.. ఇప్పుడెందుకు తెంచుకున్నట్లు? తాము చేసినలోపాలను కప్పిపెట్టుకోవడానికి కంభంపాటి.. ఇతరులపై నిందలు వేసేస్తున్నట్లుగా కనిపిస్తోంది.