నేతల హామీలు నీళ్ల మూటలుగా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడది నిజమని నిరూపించేటట్లున్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహారం చూస్తుంటే ఇదే తీరులో ఉంది. మిగిలిన హామీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే కార్యక్రమం పట్ల కూడా అదే తీరుతో వ్యవహరిస్తారన్నట్లుగా ఉంది ఆయన వైఖరి చూస్తుంటే.
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లుగా కామినేని ప్రకటించి దాదాపు ఏడాది కావస్తోంది. నిజానికి ఏపీకి వైద్య ఆరోగ్య శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా.. ఉచితంగా ప్రచారం చేయటానికి సిద్ధమయ్యారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఇలాంటి అద్భుత అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని.. వైద్య ఆరోగ్య శాఖను వీలైనంత ఎక్కువగా ప్రక్షాళన చేసే అవకాశం ఉంది.
మాటలే తప్ప చేతలు లేని కామినేని లాంటి నేతల కారణంగా.. ఏడాది కాలంగా బిగ్ బీ అంబాసిడర్ గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించని పరిస్థితి. ఒక ప్రముఖ నటుడు ఉచితంగా తాను సేవలు అందిస్తానని చెప్పినా..వాడుకోవటం చేతకాని మంత్రి కామినేని ఏమనాలి?