టీడీపీ జాబితా.. ఏ కులానికి ఎన్ని సీట్లు?

Update: 2019-03-15 11:15 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తం 126మంది అభ్యర్థులను నిన్న రాత్రి ప్రకటించేశారు. ఈ జాబితాలో చంద్రబాబు ప్రధానంగా మూడు కులాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. ముస్లింలకు రెండు సీట్లను మాత్రమే కేటాయించిన చంద్రబాబు .. బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. గుంటూరు తూర్పు - విజయవాడ పశ్చిమల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు.

ప్రధానంగా చంద్రబాబు తన సామాజికవర్గ కమ్మ నేతలకు సీట్ల కేటాయింపులో పెద్దపీట వేశారు. కమ్మ కులస్థులకు మొత్తం 126మంది ప్రకటించిన జాబితాలో 32 సీట్లను కేటాయించడం విశేషం మొత్తం సీట్లలో వారికే అగ్రస్థానం దక్కడం విశేషం.

ఇక కమ్మ కులస్థుల తర్వాత రెండో అత్యధికం బీసీలకు ఇచ్చారు. టీడీపీ జాబితాలో బీసీలకు 31 సీట్లను కేటాయించారు. అలాగే మూడో అత్యధికం రెడ్డిలకు కేటాయించారు. రెడ్డిలకు చంద్రబాబు ఈసారి 20 సీట్లను ఇచ్చారు.

ఇక బలిజ - తూర్పు కాపు అభ్యర్థులను 17చోట్ల నిలబెట్టారు.  ఇక మలి దశ జాబితాలోనైనా బ్రాహ్మణులకు ఒక్క సీటు అయినా ఇవ్వాలని ఆ వర్గం వారు కోరుతున్నారు.
Tags:    

Similar News