కేర‌ళ సీఎం ప్లాన్‌ కు స‌హ‌క‌రించిన ఆ ఇద్ద‌రు ఎవ‌రంటే?

Update: 2019-01-03 04:45 GMT
పంతం అంటే ఇలానే ఉండాలి.  స‌మ స‌మాజం కోసం త‌మ జీవితాల్ని త్యాగం చేసేందుకు సిద్ధ‌మ‌ని మాట‌లు చెప్పే కామ్రేడ్లు చేత‌ల్లో ఏం చేస్తారో చెప్పే ఉదంతమిది. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూసిన‌ప్పుడు క‌మ్యునిస్టులు అనుకోవాలే కానీ.. కోట్లాదిమంది కాద‌న్నా త‌మ పంతాన్ని పూర్తి చేసేందుకు దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ మొండిత‌నానికి ప‌వ‌ర్ జత క‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో 50 ఏళ్ల లోపు మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌వేశం ఎపిసోడ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి పోలీసుల ర‌క్ష‌ణ‌లో ద‌ర్శ‌నం చేసుకున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎవ‌రు?  న‌ల్ల‌టి వ‌స్త్రాలు ధ‌రించి.. చుట్టుప‌క్క‌ల వారికి సందేహం రాకుండా ఉండేలా క్యాస్టూమ్స్ ధ‌రించిన ఆ ఇద్ద‌రు ఎవ‌రు?  వారినే విజ‌య‌న్ ప్ర‌భుత్వం ఎందుకు ఎంపిక చేసుకుందన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

50 ఏళ్ల లోపు మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవ‌చ్చ‌న్న సుప్రీం తీర్పు అనంత‌రం.. కొంద‌రు  వామ‌ప‌క్ష ఉత్సాహ‌వంతులు.. జాతీయ స్థాయిలో ప్ర‌చారం కోరుకునే క‌మ్యునిస్టు మూలాలున్న మ‌హిళ‌లు ప్ర‌య‌త్నించారు. వీరికి ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఆగ్ర‌హం ఎదురుకావ‌టంతో వెన‌క్కి త‌గ్గారు. ఇలాంటి నేప‌థ్యంలో విజ‌య‌న్ ప్ర‌భుత్వం ఈ అంశాన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని ఒక ర‌హ‌స్య ఆప‌రేష‌న్ మాదిరి స్వామివారి ద‌ర్శ‌నాన్ని ఏర్పాట్లు చేశారు.

కేర‌ళ ముఖ్య‌మంత్రి మ‌న‌సెరిగిన‌ట్లుగా స్వామి ద‌ర్శ‌నం చేసుకోవ‌టంలో స‌క్సెస్ అయిన ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎవ‌రు?  వారి నేప‌థ్యం ఏమిట‌న్న‌ది చూస్తే..  ఆ ఇద్ద‌రూ.. క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన క‌ర‌కు కార్య‌క‌ర్త‌లుగా చెప్పాలి. కేర‌ళ‌కు చెందిన బిందు.. క‌న‌క‌దుర్గ‌లు తాజాగా శ‌బ‌రిమ‌ల ఆలయంలో  స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. వీరిలో బిందు కోజికోడ్ జిల్లా కోయిలాండీకి చెందిన మ‌హిళ‌. వృత్తిరీత్యా ఆమె కాలేజీ లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేస్తున్నారు. మ‌రొక‌రు మ‌హిళ పేరు క‌న‌క‌దుర్గ‌. ఆమె మ‌ల్లాపేరం జిల్లా అంగ‌డిపురానికి చెందిన వారు. పౌర‌స‌ర‌ఫ‌రాల విభాగంలో ఉద్యోగి. వామ‌ప‌క్ష మూలాలు ఉన్న ఈ ఇద్ద‌రు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో స్వామిని ద‌ర్శించుకోవాల‌న్న టాస్క్ ను పూర్తి చేసే బాధ్య‌త‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేశారు.

ఆల‌య ప్ర‌వ‌శం పైన ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌ని కేర‌ళ స‌ర్కారు.. ద‌ర్శ‌నం పూర్తి అయ్యాక‌.. వారిని ర‌క్ష‌ణ‌గా ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించిన త‌ర్వాత వారి ఫోటోల్ని విడుద‌ల చేశారు. త‌మ ద‌ర్శ‌నం గురించి మాట్లాడుతూ ఈ ఇద్ద‌రు మ‌హిళ‌లు.. తాము కొండ ఎక్కుతున్న‌ప్పుడు.. ద‌ర్శ‌నం చేసుకునే స‌మ‌యంలో ఎవ‌రూ అడ్డుకోలేద‌ని చెప్పారు. కుట్ర చేస్తున్న వైనం తెలీన‌ప్ప‌డు ఎవ‌రు మాత్రం ఎందుకు అడ్డుకుంటారు. త‌ప్పుదోవ ప‌ట్టించేలా న‌ల్లటి వ‌స్త్రాలు ధ‌రించి.. ఎవ‌రికి ఎలాంటి అనుమానం లేకుండా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు అయ్య‌ప్ప భ‌క్తులు ఎందుకు అడ్డుకుంటారు. భ‌క్తులు ఎవ‌రైనా.. అధ్యాత్మిక చింత‌న ఉన్న వారు త‌మ సెంటిమెంట్ల‌ను ఎదుటివారు గుర్తించాల‌ని కోరుకుంటారే కానీ.. అదే ప‌నిగా మోర‌ల్ పోలీసింగ్ చేయాల‌ని అనుకోర‌న్న విష‌యాన్ని గుర్తించాలి.


Full View

Tags:    

Similar News