సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంతో ప్రొఫెసర్ కంచె ఐలయ్య సృష్టించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. పైగా రోజుకో మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లు టీవీల్లో చర్చలకు పరిమితం అయిన ఈ వివాదం తాజాగా బలప్రదర్శనకు వేదికగా మారింది. కంచె ఐలయ్య తమతో చర్చకు రావాలని ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్త డిమాండ్ చేయడం, ఐలయ్య ఈ చర్చకు సిద్ధపడకపోవడంతో ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నం చేయడం...వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేకెత్తించింది. ఈ వివాదం సద్దుమణిగిన సమయంలో కంచ ఐలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఆర్యవైశ్య సంఘం నేతలు ఇంటి ముట్టడికి ప్రయత్నించారని...శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో తర్చల పేరుతో దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీవీ చర్చల్లో తనను బూతులు తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను పోస్టు హిందూ ఇండియా అనే పుస్తకంలో రాసిన ఒక చాప్టర్ సామాజిక స్మగ్లర్లు అని వివరించారు. ``ఈ పుస్తకాన్ని చాలా ఏళ్ల క్రితమే రాశాను. దానిపై జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా చర్చ జరిగింది. నా పుస్తకంపై అభ్యంతరం ఉంటే కేసులు పెట్టవచ్చు. న్యాయాన్యాయాలు కోర్టులు తేలుస్తాయి. కానీ...తెలుగులో వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్య సంఘాలు ఉన్మాదం ప్రదర్శిస్తున్నాయి. నెల రోజులుగా నాపై మీడియా ముఖంగా, వ్యక్తిగతంగా నాపై ఫోన్ లో - ముఖాముఖిగా హింసకు పాల్పడుతున్నారు`` అని మండిపడ్డారు. ఇవాళ తనకు భద్రత కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి - పోలీసులకు కృతజ్ఞతలని ఐలయ్య తెలిపారు.
ఒక రచయితగా తనపై జరుగుతున్న దాడివెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రమేయం ఉందని భావిస్తున్నానని ఐలయ్య కలకలం రేపే కామెంట్లు చేశారు. చర్చకు సిద్ధమని పేర్కొంటూ... చర్చ జరిగితే తాను అమిత్ షాతోనే తేల్చుకుంటామని ఐలయ్య ప్రతి సవాల్ విసిరారు. ఆర్యవైశ్యులతో తాను చర్చలు జరిపే ప్రసక్తే లేదని, పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునే వారితో చర్చలేంటి? అని ఆయన అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జేఎన్యూలో ఆచార్యుల మధ్య తన పుస్తకంపై చర్చ పెడితే తాను కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారు. తన పుస్తకంలో ఉత్పత్తిలో భాగమైన కులాలు, ఉత్పత్తిలో భాగంకాని కులాలను వర్గీకరించానని ఐలయ్య తెలిపారు. అంబానీ, అమిత్ షా బనియాలని ప్రకటించుకున్నారని తెలిపారు. డీమోనిటైజేషన్ దేశ చరిత్రలోమే అతిపెద్ద సోషల్ స్మగ్లింగ్ అని ఐలయ్య ఆరోపించారు. అత్యధికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న కులం ఆర్యవైశ్యులని మండిపడ్డారు. రైతులు బ్యాంకు వడ్డీ 100కు వడ్డీతో కలిపి 108 రూపాయలు చెల్లిస్తారని..కానీ వైశ్యుల 100కు 137 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైశ్యులు తమ పెట్టుబడితో విద్యను, మీడియాను నియంత్రిస్తున్నారని ఐలయ్య ఆరోపించారు. ప్రస్తుతం అక్షరానికి అడ్వర్టైజ్ మెంట్ కు మధ్య పోరు జరుగుతోందని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ ఒక్క వైశ్యుల వైపే ఎందుకు నిలబడుతోందని ఐలయ్య ప్రశ్నించారు. ``ఎస్సీ - ఎస్టీ - బీసీలు - సైనికులు ఆరెస్సెస్ కు దేశభక్తులుగా కనిపించడం లేదా? అమిత్ షా వైశ్యుడైనందుకే ఆరెస్సెస్ వైశ్యులకు వెన్నుదన్నుగా నిలుస్తోందా?`` అని నిలదీశారు. ఎస్సీ - ఎస్టీ - బీసీలు జాతీయవాదులని... వైశ్య కంపెనీలకు జాతీయభావాలుంటే వారి కంపెనీల్లో ఎస్సీ - ఎస్టీ - బీసీ లకు జనాభా దామాషా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.