తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లించుకుంటానని ప్రకటించడమే కాకుండా ఇటీవల దాన్ని నెరవేర్చుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చర్యపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కేసీఆర్ నుంచి ‘మొక్కుల డబ్బులు’ రికవరీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలంటూ సామాజిక కార్యకర్తలు కంచె ఐలయ్య - జి. రాములు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి - తిరుచానూరు పద్మావతి అమ్మవారు - వరంగల్ లోని భద్రకాళి అమ్మవారు - కురవి మల్లన్న తదితర దేవుళ్లకు కామన్ గుడ్ ఫండ్ నిధులతో కేసీఆర్ బంగారు ఆభరణాలు చేయించారని ఐలయ్య - రాములు తెలిపారు. కేసీఆర్ మొక్కులు తీర్చేందుకు ప్రజల సొమ్ము ఉపయోగించారని, కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను వాడుకున్నారని కోర్టుకు తెలిపారు. సిజిఎఫ్ నిధులను సొంత మొక్కుల కోసం కేసీఆర్ వినియోగించడం సరికాదన్నారు. సీజీఎఫ్ నిధుల వినియోగం కోసం నియమావళి ఉందని, ఈ నియమావళికి లోబడే నిధులను వాడాలని వారు గుర్తు చేశారు. కేసీఆర్ మొక్కుల కోసం జారీ చేసిన జీఓలను కొట్టివేయాలని - ఈ మేరకు డబ్బును కేసీఆర్ నుండి రాబట్టేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ పిల్ లో కంచె ఐలయ్య - రాములు కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/