వివాదాస్పద పుస్తకాలు అంతకు మించిన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాలో కనిపించే ప్రొఫెసర్ కంచె అయిలయ్య తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఆ మధ్య వైశ్యులను ఉద్దేశించి ఆయన రాసిన పుస్తకం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఆ ఇష్యూ ఎంతో కాలం నడిచింది.
ఆ తర్వాత ఐలయ్య పెద్దగా బయటకు వచ్చింది లేదు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని సీపీఎం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించి.. దోషుల్ని శిక్షించాలన్న అంశంపై జరిగిన సదస్సులో కంచె అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. ప్రముఖ అధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చినజీయర్ స్వామి పాలిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ ఏ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పింలేదన్న ఆయన.. అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవటం హేయమన్నారు. అంబేడ్కర్ తో పెట్టుకున్న వారుఎవరూ బాగుపడలేదన్న ఆయన.. విగ్రహాన్ని కూల్చివేసిన చోటే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కావాలనే దళితుల్ని.. కమ్యునిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అదేంటి ఐలయ్య.. ఈ మధ్యనేగా కేరళ వెళ్లి కమ్యూనిస్ట్ సీఎంను కలిసి.. ఆయనతో రాయబారాలు చేసింది..? అలా మర్చిపోయి ఊత్తనే సీఎంసారును ఆడిపోసుకుంటారేంటి ప్రొఫెసర్జీ?