వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే - లోకేష్‌ కు దేత్తడే

Update: 2019-03-21 14:12 GMT
 రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలున్నా కానీ గెలిచి మంగళగిరి మొనగాడు అన్పించుకోవాలని ఏరికోరి మంగళగిరిని సెలెక్ట్‌ చేసుకున్నారు లోకేష్‌. చంద్రబాబు కూడా చాలా సర్వేలు చేసి మంగళగిరి సేఫ్ అని నమ్మిన తర్వాతే లోకేష్‌ని బరిలోకి దింపారు. ఇక లోకేష్‌ కు మంగళగిరి సేఫ్  అని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్లుతో ఆర్కే చేతిలో ఓడిపోయారు. ఇక 2009లో మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల. గంజి చిరంజీవి - కాండ్రు కమల ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. నెల రోజుల క్రితం మంగళగిరి ఎమ్మెల్యే సీటు కోసం కాండ్రు కమల టీడీపీలో చేరారు. ఇక 2004లో మంగళగిరి నుంచి గెలిచిన మురుగుడు హనుమంతరావు కూడా పద్మశాలీనే. ఆయన కూడా టీడీపీలో చేరారు. సో.. మంగళగిరి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్లంతా ప్రస్తుతం టీడీపీకి వచ్చేశారు. వాళ్లంతా లోకేష్‌ కోసం పనిచేస్తారు. వారి సామాజిక ఓట్లన్నీ లోకేష్‌ కే పడతాయి. మిగిలిన ఓట్లు ఎలాగూ టీడీపీకే పడతాయి అనే ఉద్ధేశంతో మంగళగిరి సెలెక్ట్ చేసుకున్నారు.

అయితే పార్టీ మారితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ్యవచ్చు అని అనుకున్న కాండ్రు కమల ఆసలు గల్లంతయ్యాయి. దీంతో ఆమెను లోకేష్‌ ని బహిరంగంగానే విమర్శించారు. లోకేష్‌ మంగళగిరిలో ప్రచారం చేస్తున్న దగ్గర నుంచి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే లోకేష్‌ ని ఓడించాలి అనుకున్న కాండ్రు కమల.. డైరెక్ట్‌ గా జగన్‌ దగ్గరకు వెళ్లి వైసీపీలో జాయిన్‌ అయిపోయారు. దీంతో.. ఇప్పుడు చంద్రబాబు అంచనాలు అన్నీ తారుమరయ్యాయి. కాండ్రు కమల వైసీపీలో చేరడంతో.. ఇప్పుడు  ఓట్లు చీలిపోతాయి. చేనేత కార్మికుల ఓట్లు చీలితే అంతిమంగా అది వైసీపీకి ప్లస్‌ అవుతుంది. దీంతో.. చంద్రబాబు ఫుల్ టెన్షన్‌ లో ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News