ఎన్నికల ముందు నాయకులు అధికారం కోసం సాధ్యం కాని ప్రమాణాలు చేసి ప్రజలను మోసగిస్తారు. అయితే ఇది ఒక్క ప్రజలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎన్నికల ముందు పార్టీ అధినేతలు మీకు మా పార్టీలో టిక్కెట్లు ఇస్తామంటూ ఆశావాహులను ప్రలోభాలకు గురి చేసి ఆ తర్వాత వారికి హాత్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు తన అధికారం నిలబెట్టుకోవడానికి ఏమైనా చేసేవారు.. కాని ఇప్పుడు తన కుమారుడికి అధికారం నిలబెట్టడం కోసం తాను చేసిన వాగ్దానాలు సైతం మరుగున పరిచారు. తన కుమారుడు నారా లోకేష్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా - ఎటువంటి వ్యతిరేక పవనాలు లేని చోట నుంచి బరిలోకి దింపాలని బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట లోకేష్ ను విశాఖ జిల్లా భీమిలి నుంచి బరిలోకి దింపాలని అనుకున్నారు. కాని అక్కడ వైఎస్ ఆర్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉన్నందున తన కుమారుడికి ఇబ్బంది కలగ కూడదని - మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు .
అయితే మంగళగిరి నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావాహులు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. ఈ విషయమై వారిని బుజ్జగించేందుకు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. అయితే మంగళగిరి నుంచి టిక్కెట్టు ఆశించిన కాండ్రు కమల నారా లోకేష్ ను నిలదీసారు. మీ నాన్న మాకు టిక్కెట్టు ఇస్తామని చివరి వరకూ నమ్మించి మోసం చేసారు అని లోకేష్ ను నిలదీసారు. మా కుటుంబంలో మాలో ఒకరికి - మా వియ్యంకుడికి కూడా టిక్కెట్టు ఇస్తామన్న హామితోనే మేము తెలుగుదేశం పార్టీలో చేరామని కాని ఇప్పుడు మీరు మంగళగిరి నుంచి పోటీ చేయడం మమల్ని మోసం చేసినట్టే కదా అని ఆవిడ లోకేష్ ను నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ పరిణామం ఊహించని చినబాబు ఖంగు తిని మీ అందరి భవిష్యత్తు చంద్రబాబుగారు చూసుకుంటారని అన్నారు. దానికి కాండ్రు కమల సమధానంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మా పద్మశాలీలకు ఏమి చేయలేదు... ఇక అధికారంలోకి పోయాక ఏం చేస్తారు అని అనడంతో నారా లోకేష్ అక్కడ నుంచి మారు మాట్లాడ కుండా జారుకున్నట్టు చెబుతున్నారు.