ఐసీపీ వన్డే వరల్డ్ కప్-2019 లో భాగంగా నిన్న రాత్రి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ నిజంగానే ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్ ల్లోకి హై ఓల్టేజీ మ్యాచ్ గా పరిగణించక తప్పదేమో. ఎందుకుంటే... తొలి వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు ఇటు ఇంగ్లండ్ జట్టుతో పాటు అటు న్యూజిల్యాండ్ జట్టు కొదమ సింహాల్లా పోరాడితే... విజయం ఇరు జట్ల మధ్య చివరి దాకా దోబూచులాడితే... ఓ త్రో బాల్ విన్నర్ ను నిర్దేశించింది. అది కూడా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో జరిగిన సూపర్ ఓవర్ లోనూ ఇరు జట్టు ఒకే స్కోరు చేయడం నిజంగానే ఆశ్చర్యం అనిపించక మానదు. మొత్తంగా చివరి బంతి ముగిసిన తర్వాత కూడా మరో 12 బంతుల దాకా విజయం ఎవరిదో తేలక ఇరు జట్ల సభ్యులతో పాటు యావత్తు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ మునివేళ్లపై నిలబడి మ్యాచ్ వీక్షించక తప్పలేదు. పోరులో ఇరు జట్లు సమంగానే రాణించగా... ఓ త్రో బాల్ విజేతను నిర్ణయించిన వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ - జట్టుకు తొలి వరల్డ్ కప్ అందడంలో కీలక భూమిక పోషించిన బెన్ స్టోక్స్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా... సదరు త్రో బాల్ తన బ్యాట్ ను తగలకుండా ఉండి ఉంటే... విజయం కివీస్ నే వరించేందేమోనని కూడా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ త్రో బాల్ ఏమిటి? విన్నర్ ను నిర్ణయించడం ఏమిటి? దీనిపై స్టోక్స్ ఏమన్నాడు? అన్న వివరాల్లోకి వెళితే... సూపర్ ఓవర్ లో భాగంగా ఇంగ్లాండ్ చివరి మూడు బంతుల్లో 9 పరుగులు చేయాలి. ఈ క్రమంలో కప్ గెలవడానికి న్యూజిలాండ్ కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు. ఆ బంతిని స్టోక్స్ ఫోర్ కొట్టాలని చూశాడు. బంతి గప్తిల్ కు దొరికింది. అతడు త్రో విసిరాడు.. అయితే బాల్ వికెట్లకు తాకేలోగానే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకిన ఆ త్రో బాల్ ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. స్టోక్స్ హిట్టింగ్ తో రెండు - ఓవర్ త్రో రూపంలో నాలుగు... ఒకే బాల్ కు మొత్తం ఆరు పరుగులొచ్చాయి. త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లండ్ కు కలిసి వచ్చాయి.
ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం ప్రస్తావించిన స్టోక్స్.. *న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను. ఇది తాను కావాలని చేసింది కాదు.. బాల్ అలా అనుకోకుండా నా బ్యాట్ ను తాకింది. అదే తమ గెలుపులో కీలకంగా మారింది. ఇందుకు కేన్ కు క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడింది. ఎన్నో మాటలు పడింది. చివరకూ తాము అనుకున్నది సాధించాం. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని నేను భావించడం లేదు* అంటూ ఆ త్రో బాల్ తన బ్యాటును తాకడం తమకు ఎంత మేలు చేసిందన్న విషయాన్ని వెల్లడించడు. అంటే ఫైనల్ పోరులో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా రాణిస్తే... ఈ త్రో బాల్ మాత్రమే విన్నర్ ను నిర్ణయించిందన్న మాట.