భివాండీలో ఘటన మరో పుల్వామా దాడి వంటిది : కంగనా

Update: 2020-09-24 17:38 GMT
మహారాష్ట్రలోని భివాండీలో బుధవారం జరిగిన ఓ భవనం కూలిన ఘటన లో మృతుల సంఖ్య 41కి చేరింది. గత ఆదివారం రాత్రి థానే కు ఆనుకుని ఉన్న భివాండీలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతస్థుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం భీవాండీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, దీని కింద సుమారు 50 మంది శిథిలాల కింద చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్థానికుల కథనం ప్రకారం ఈ భవనం సుమారు 40 ఏళ్ల నాటిది అని తెలుస్తోంది.

ఈ ఘటన పై బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శలు చేసింది. భివాండీలో ఘటన మరో పుల్వామా దాడి వంటిది అని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేను, శివసేన నేత సంజయ్ రౌత్ పై విమర్శలు చేసింది. మహారాష్ట్ర సర్కార్ వైఫల్యం వల్లే భివాండీలో భవనం కూలి సుమారు 50 మంది మరణించారని, ఈ పురాతన భవనంపై మీరు దృష్టి పెట్టి ఉంటే ఇంతమంది మరణించి ఉండేవారు కారని, అక్రమంగా నా ఆఫీసును కూల్చివేసే బదులు ఇలాంటి బిల్డింగులపై ఎందుకు ఫోకస్ పెట్టరని కంగనా ట్విట్ చేసింది. మీ నిర్లక్ష్యం కారణంగా పుల్వామా ఎటాక్ లో మరణించిన మన జవాన్లకన్నా ఎక్కువమంది ఈ బిల్డింగ్ కూలిన ప్రమాదంలో చనిపోయారని, అసలు ముంబై నగరానికి ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ తెలిపింది.
Tags:    

Similar News