పోతూ పోతూ అన్నీ వెంటబెట్టుకుని పోతున్నారు అని అంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి బీజేపీ మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం. ఆయన బీజేపీలో నాలుగేళ్ల పాటు కొనసాగారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కీలకంగా రెండేళ్ల పాటు వ్యవహరించారు. ఇపుడు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. మోడీ పట్ల భక్తి ఉంది కానీ బీజేపీ మాత్రం తనకు సరిపడని చెప్పడంలోనే కన్నా రాజకీయ చాతుర్యం తెలుస్తుంది.
కన్నా లక్ష్మీనారాయణ మనసు అంతా తెలుగుదేశం మీద ఉందని, అది చాలా కాలంగానే తెలిసిన విషయం అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎట్టకేలకు ఆ మనసు కన్నా విప్పేశారు. ఈ నెల 23న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. ఆయన టీడీపీలో చేరడం లాంచనం అని కూడా తెలుస్తోంది. చంద్రబాబు విజయవాడ వస్తే అక్కడ ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పుకోవడానికి కన్నా సిద్ధంగా ఉన్నారు.
ఇక తన చేరిక అలా ఇలా ఉండకూడని ఆయన భారీ ప్లాన్స్ వేస్తున్నారు. గుంటూరుకు చెందిన తన వర్గం వారిని అభిమానులను, అనుచరులను పెద్ద ఎత్తున పోగు చేసుకుని మరీ గ్రాడ్ లెవెల్ లో సైకిల్ పార్టీలో చేరాలనుకుంటున్నారు. కన్నా అన్న బిగ్ షాట్ టీడీపీలో చేరింది అన్న మెసేజ్ పార్టీ జనాలతో పాటు ఏపీ రాజకీయ జానలకు కూడా స్ట్రాంగ్ గా వెళ్లాలన్నదే కన్నా ప్లాన్.
దాంతో కన్నా తాను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండగా అనేకమందికి పదవులు ఇచ్చారు. అలాంటి వారు, తనతో నాడు కలిసి అడుగులు వేసిన వారిని కూడా తోడు తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అని అంటుననరు. దాంతో గుంటూరులోని కన్నా నివాసం ఇపుడు సందడి చేస్తోంది. ఏపీలోని నలుమూలల నుంచి ఆయంతో సన్నిహితంగా ఉంటున్న బీజేపీ నాయకులు రాకతో కలివిడిగా ఉంది.
అలా విశాఖకు చెందిన మాజీ మంత్రి విష్ణు కుమార్ రాజు కన్నాను కలసి చర్చలు జరపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన కన్నా కంటే ముందు నుంచి బీజేపీలో ఉంటూ వచ్చారు. 2014లో ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు. అలాంటి రాజు గారు ఇపుడు బీజేపీని వీడబోతున్నారు అని అంటున్నారు. ఆయన కనుక వస్తే ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీని వీడినట్లే అనుకోవాలి.
ఇదే విధంగా రాయలసీమ నుంచి ఒక మాజీ మంత్రి కూడా బీజేపీని వీడుతారు అని అంటున్నారు. అలాగే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు ఏపీలోని కోస్తా జిల్లాల నుంచి కూడా కమలానికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం లో చేరుతరు అని అంటునారు. ఈ విధంగా చూస్తే కన్నా ఒక మాస్టార్ ప్లాన్ తోనే ఉన్నారని అంటున్నారు. తాను ఒక్కడినే పార్టీని వీడడం లేదని, తాను ఒక వ్యక్తిని కాదని, శక్తిని అని నిరూపించడానికే కన్నా ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.
చాలా కాలం క్రితమే కన్నా ఒక మాట అంటూ వచ్చారు. తాను బీజేపీలో వివిధ పదవులలో నియమించిన వారిని ప్రస్తుత ప్రెసిడెంట్ సోము వీర్రాజు తప్పించేస్తున్నారు అని. ఇపుడు వారంతా కన్నాతో టీడీపీలో చేరబోతున్నారా అంటే మెజారిటీ నడుస్తారు అని అంటున్నారు. అసలే బీజేపీకి ఏపీలో పెద్ద బలం లేదు. ఉన్న వారు కూడా కన్నా వెంట నడిస్తే ఇక ఏముంటుంది. ఎలా బీజేపీ ముందుకు సాగుతుంది అన్నది చూడాలి.
ఏది ఏమైనా కన్నా తాను ఏపీ రాజకీయాల్లో బిగ్ లీడర్ ని అని చెప్పుకోవడమే కాదు అందరికీ చూపించాలన్న పట్టుదలతో బీజేపీని వీక్ చేసే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. మరి బీజేపీ నుంచి వెళ్తున్న నాయకుల విషయంలో సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు ఏమి చేస్తారు అన్నదే చూడాలిపుడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.