ఇందుకే క‌దా క‌న్నాను ప‌ద‌విలో నియ‌మించింది

Update: 2018-05-23 15:46 GMT
బీజేపీ సిద్ధాంతాల కంటే...ఏపీలో రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చి పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌నే క‌న్నా రంగంలోకి దిగారు. చంద్ర‌బాబుపై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. త‌ను ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లాన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు తీరుపై క‌న్నా విరుచుకుప‌డ్డారు.  ``చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే ఫోకస్ పెట్టారు` అంటూ క‌న్నా సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ క‌ల‌క‌లం సద్దుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రో కామెంట్ల చేశారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షాను ఢిల్లీలో క‌లిసిన అనంత‌రం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ  మీడియాతో మాట్లాడుతూ ఇటీవ‌లి కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా ఇర‌కాటంలో ప‌డుతున్న తిరుమ‌ల తిరుప‌తి వివాదంపై కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని ఇదేం ప‌ద్ద‌త‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భ‌క్తుల అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని క‌న్నా కోరారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని క‌న్నా క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ ఇప్ప‌టివ‌ర‌కు త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌ని సంగ‌తి తెలిసిందే. దీనిపై మీడియా పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుందని, అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా తెలిపారు. కాగా, త్వ‌ర‌లో ఏపీలో ప‌ర్య‌టించాల‌ని అమిత్ షాను క‌న్నా కోరిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో కొంద‌రు సీనియ‌ర్లు చేర‌నున్నార‌ని, వారితో చ‌ర్చ‌లు తుది ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలిపిన క‌న్నా ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను ఖ‌రారు చేస్తే తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.
Tags:    

Similar News