బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమించిన తర్వాత....ఆ విమర్శల పర్వం మరింత ఎక్కువైంది. చంద్రబాబుపై సందర్భానుసారంగా కన్నా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబును కార్నర్ చేయడానికి వెనుకాడడం లేదు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఉండబోతోందని వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా చంద్రబాబుపై కన్నా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డ్రామాలు వేయడంలో దిట్ట అని,... పక్కా కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి ఆ డ్రామాను రక్తి కట్టిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
పొత్తు పై వస్తోన్న పుకార్ల నేపథ్యంలో చంద్రబాబుపై కన్నా విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదని కన్నా విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ను నానామాటలు అన్ని చంద్రబాబు....ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునేందుకు చూడడం దారుణమన్నారు. నిన్నటివరకు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు హఠాత్తుగా....కాంగ్రెస్ కు బాసటగా నిలవాని చూడడం విడ్డూరమన్నారు. అసలు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ...కాంగ్రెస్ కు మద్దతిచ్చేలా చంద్రబాబు వ్యవహరించాలనుకోవడం దారుణమన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని విమర్శించారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని అన్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఓ సరికొత్ కొత్త నాటకానికి ఓ సినీనటుడు తెరపైకి వచ్చాడని శివాజీని ఉద్దేశించి అన్నారు.