ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బాబు భేటీ అవడంపై కన్నా స్పందిస్తూ ఊసరవెల్లి కూడా ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితిని చూసి సిగ్గుపడే సందర్భం చంద్రబాబు వల్ల కలిగిందని వ్యాఖ్యానించారు. ఈ పొత్తు వెనుక ఉద్దేశం చంద్రబాబునాయుడు అధికారదాహం తప్ప రాష్ట్ర అభివృద్ధికి కాదు అనేది సుస్పష్టమని కన్నా వ్యాఖ్యానించారు. మామను వెన్నుపోటు పొడిచి అప్పుడు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని కన్నా మండిపడ్డారు.
``1996 లో ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి ఆయనను మానసిక క్షోభ కు గురిచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇప్పటివరకు ఏ ఒక్క ఎన్నికల్లో అయినా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? సోనియాగాంధీపై అప్పుడు నరేంద్రమోడీపై ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారు. ఎన్నిరకాలుగా మాట మారుస్తారు? తన రాజకీయ అవసరాల కోసం తప్ప ఏ నాడు అభివృద్ధి గురించి ఆలోచించని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. కాంగ్రేస్ పార్టీతో చేతులు కలిపిన పాపానికి 2019లో టీడీపీ భూస్థాపితం కావడం తధ్యం. ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అణగతొక్కే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు రాజకీయం. తన అవినీతి బండారం బయటకు రాకుండా ఉండాలని తప్ప రాహుల్ గాంధీని సమర్థిస్తున్నారు. చంద్రబాబు స్టాట్చ్యూ ఆఫ్ అపార్చునిటీ`` అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్నాడని, బాబు నాయకత్వం అవసరమా ఆలోచించాలని ప్రజలకు కన్నా పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారని మరిచిపోయి రాజకీయాలు చేస్తున్నారని, దేశ రక్షణ కాదని...అవినీతి బండారం బయటపడుతుందోనని భయపడి పారిపోయి కాంగ్రెస్ తో దోస్తీ కడుతున్నాడని తెలిపారు. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడని అన్న బాబు ఆయనతో చేతులు కలపడం హాస్యాస్పదమన్నారు. బాబు..అతని మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. 2019లో మోడీ అధికారంలోకి రావడానికి వీల్లేదని...అధికారంలోకి వస్తే వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందో...అనే భయంతో బాబు పొత్తులు పెట్టుకుంటున్నాడని తీవ్రంగా విమర్శించారు.