కన్నా లక్ష్మీనారాయణ... ఇపుడు ఏపీలో ఒక కొత్త సంచలనం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి రిజైన్ చేసిన నేతకు ఏకంగా దానిని ఆమోదించకుండా ఏకంగా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఒక అరుదైన విషయంగానే చెప్పాలి. బీజేపీ రాష్ట్ర నేతలు ఎవరూ ఊహించని స్థాయిలో కన్నాకు పదవి అప్పగించడంలో బీజేపీలో కలకలం, ఏపీలోని ప్రధాన కులాల్లో ఆందోళన రేపింది.
ఏపీలో ప్రధానంగా మూడు కులాలు... రాజకీయంగా డామినేటింగ్ కులాలు. కమ్మ, కాపు, రెడ్డి. తెలంగాణ వేరు పడ్డాక కాపు కులానికి ఏపీలో కాపుకులానికి మరింత రాజకీయాదరణ దక్కింది. రెండు ప్రధాన పార్టీలు కమ్మ -రెడ్డి కులాలను నమ్ముకుంటే అధిక సంఖ్యలో ఉన్న కాపుకులానికి తాను ప్రాతినిధ్యం వహిస్తే వేగంగా పుంజుకోవచ్చనేది బీజేపీ ఆలోచనగా అనిపిస్తోంది. వారి ఆలోచన ఈ దిశగా సాగుతుందని చెప్పడానికి బలమైన ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ.
అయితే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆ వర్గానికి ప్రతినిధిగా ఆ కులంలోని ప్రధాన వర్గం ఒకటి భావిస్తోంది. నిజానికి కులంలో గ్లామర్ ఉన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. కానీ, పవన్ రాజకీయ విధానం సాధారణ ఓటర్లను ఆకట్టుకునేలా ఉండదని, కాబట్టి ఎన్నికల సమయానికి జనసేన బాగా వెనుకపడే అవకాశం ఉందని భావించిన బీజేపీ వారు ఇంకో పార్టీ వెతుక్కోకుండా తమ పార్టీని ఆ కులానికి ఒక అవకాశంగా మలచాలని డిసైడ్ అయ్యారు. గతంలో విభజన గొడవల్లో భాగంగా సీఎం పోస్టుకు కూడా కన్నా పేరు పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో కన్నా బలమైన వ్యక్తి. పైగా రాజకీయ అనుభవం, ప్రధాన ఎన్నికల్లో నలుగురిని గెలిపించుకోగలిగిన సామర్థ్యం కూడా ఉన్న వ్యక్తి కన్నా. అందుకే బీజేపీ ఆయనకు ఓటేసింది.
అయితే, బీజేపీ ఆలోచనను మరింత వేగంగా అందిపుచ్చుకున్న కన్నా వెంటనే రాజకీయ సమీకరణలు మొదలుపెట్టారు. ప్రత్యక్షంగా కుల నాయకుడిగా ప్రకటించుకుని తెలుగుదేశంపైన పోరాడుతున్న ముద్రగడను, ఇంకొందరు నేతలను కన్నా లక్ష్మీనారాయణ పదవి వచ్చిన మరుసటి రోజే కలిశారు. పార్టీలోకి ఇతర కాపు నేతల వలసలను ప్రోత్సహించడానికి రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ఈ మీటింగ్ జరిగినట్టు చెబుతున్నారు. మరి కన్నా జనసేనను కాదని ఆ కులంలోకి బీజేపీని ఎంత బలంగా తీసుకెళ్తారన్నది ఇపుడు పెద్ద ప్రశ్న.