బాబును డిఫెన్స్ లో ప‌డేసేలా క‌న్నా క్వ‌శ్చ‌న్స్!

Update: 2018-08-02 07:29 GMT
నాలుగేళ్లు రాసుకుపూసుకొని తిరిగి.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని ఎంత‌లా దెబ్బ తీయాలో అంత‌లా దెబ్బ తీసిన బీజేపీ.. టీడీపీలు.. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇప్పుడు వేర్వేరు కావ‌టం తెలిసిందే. క‌లిసి ఉన్న‌ప్పుడు ఒక‌రి లోపాల‌పై మ‌రొక‌రు పెద‌వి విప్పే వారే కాదు. ఇప్పుడేమో అందుకు భిన్నంగా ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం క‌నిపిస్తోంది.

ఇక‌.. మోడీ స‌ర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాసంతో ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం మ‌రింత‌గా ముదిరిపోయింది. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అయితే.. మోడీలోని ప్ర‌తి క‌ద‌లిక‌ను.. ప్ర‌తి మాట‌ను త‌ప్పు ప‌డుతూ.. నిత్యం అదే ప‌నిగా మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును డిఫెన్స్ లో ప‌డేసేలా ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా కొన్ని ప్ర‌శ్న‌ల్ని సంధించారు.

క‌న్నా ప్ర‌శ్న‌ల‌కు బాబు చ‌ప్పున స‌మాధానం చెప్ప‌లేని రీతిలో ఉండ‌టం విశేషం. అదే ప‌నిగా మోడీపై విరుచుకుప‌డుతున్న బాబు ఆగ్ర‌హానికి చెక్ చెప్పేలా క‌న్నా క్వ‌శ్చ‌న్స్ ఉన్నాయి.

బాబుపై క‌న్నా సంధించిన ఐదు ప్ర‌శ్న‌ల్ని చూస్తే..

1. విజ‌య‌న‌గ‌రం కొత్త‌వ‌ల‌స‌లో జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న రూ.500 కోట్ల భూక‌బ్జా మీద మీరు సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మేనా?

2. రిజ‌ర్వేష‌న్ల‌ను ఒక కేట‌గిరి నుంచి మ‌రో కేట‌గిరికి మారుస్తాన‌ని హామీ ఇవ్వ‌లేదా?

3. జ‌గన్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని ప్ర‌జ‌ల‌కు పంచిపెడ‌తాన‌న్న‌మాట ఏమైంది?

4. రైతుల‌కు మేలు చేసే చిత్తూరు డెయిరీని తిరిగి తెరుస్తాన‌న్న హామీ ఏమైంది?

5. టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డి అవినీతిలో నీ కొడుకు నారా లోకేశ్ భాగ‌స్వామి కాదా?

ఇలా స‌మాధానాలు వెంట‌నే చెప్ప‌లేని ప్ర‌శ్న‌లు వేసిన క‌న్నా.. బాబుకు షాకిచ్చార‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. బాబును ప్ర‌శ్న‌ల్ని సంధించిన వాటిల్లో కొన్ని ప్ర‌శ్న‌లను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా క‌న్నా సంధించ‌టం గ‌మ‌నార్హం. అంద‌రి నేత‌ల‌కు ఒకేలాంటి ప్ర‌శ్న‌ల్ని సంధించ‌టంలో మ‌ర్మ‌మేంది క‌న్నా?
Tags:    

Similar News