ముందు సంసారం... వెనుక వ్యభిచారమా?

Update: 2019-04-08 16:15 GMT
టీడీపీ వ్యవస్థాపకుడు - తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారకరామారావుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగు నేల వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణతో సంభాషించిన సందర్భంగా ఎన్టీఆర్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎప్పటిదో తెలియదు గానీ... ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల్లో భాగంగానే చంద్రబాబు, రాధాక్రిష్ణల మధ్య సంభాషణ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరును శాశ్వతంగా మరిచిపోయేలా చేయాలని, అందుకు ఏం చేయాలన్న కోణంలో ఈ చర్చ జరగగా... ఎన్టీఆర్ ను చంద్రబాబు... వాడు, వీడు అంటూ వ్యాఖ్యలు చేయడం కూడా పెను దుమారాన్ని రేపుతోంది. ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఒక్క టీడీపీ మినహా అన్ని పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.

కెమెరాల ముందు సంసారులుగా నటిస్తూ.. కెమెరాల వెనుక వ్యభిచారం చేస్తున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని కన్నా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, రాధాక్రిష్ణలను టార్గెట్ చేసుకున్న కన్నా... ‘కెమెరాల ముందు సంసారం - కెమెరా వెనుక వ్యభిచారం. ఇదీ మీ పచ్చ పత్రికల భాగోతం. ఎన్టీఆర్ ను చంపారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ాయన విలువలకు అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు ఆయనను చరిత్ర నుంచి తుడిచేయడానికి తెగించారు. ఏపీ రాజకీయ చరిత్రకు చంద్రబాబు ఒక అవినీతి మచ్చ‘ అంటూ కన్నా ఓ రేంజిలో ఫైరైపోయారు.
Tags:    

Similar News