వెంక‌య్య‌ను క‌న్న‌డిగులు కూడా ఛీ కొడుతున్నారే

Update: 2016-05-18 14:50 GMT
అయినోళ్ల ద‌గ్గ‌రే కాదు ప‌రాయి వాళ్ల ద‌గ్గ‌ర చీ కొట్టించుకోవ‌టానికి మించిన అవ‌మానం ఇంకేం ఉంటుంది? తాజాగా కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడి ప‌రిస్థితి ఇంచుమించే ఇదే తీరులో ఉంద‌ని చెప్పాలి. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం అంటే ఏమిటో తెలీని వెంక‌య్య‌ను.. పార్టీకి చేసే సేవ‌కు గుర్తింపుగా ఇప్ప‌టికి మూడుసార్లు ఆయ‌న్ను రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని క‌ట్ట‌బెట్ట‌టం తెలిసిందే. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వంలో ఒక‌డిగా ఉంటూ.. అధినాయ‌కుడికి పూర్తి విదేయుడిగా ఉంటూ అంద‌రికి కావాల్సిన వాడిగా ఉండ‌టం వెంక‌య్య ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు. విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న గారి టోన్ విన్న సీమాంధ్రులు ఎంత‌గానో సంతోషించారు. త‌మ త‌ర‌ఫున ఆలోచిస్తూ.. గ‌ట్టిగా మాట్లాడేవాడు ఒక్క‌డైనా ఉన్నాడంటూ ఆనందించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు అని ప్ర‌ధాని హోదాలో ఉన్న మ‌న్మోహ‌న్ సింగ్ హామీ ఇస్తే.. మొన‌గాడిగా పైకి లేచి.. త్వ‌ర‌లో తాము అధికారంలోకి వ‌స్తున్నామ‌ని.. తాము ప‌వ‌ర్ లోకి రాగానే ఏపీకి ప‌దేళ్ల ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ చేసిన హ‌డావుడి అంతాఇంతా కాదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే మోడీ మైండ్ సెట్ మారిపోవ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే వెంక‌య్య మాట‌లు మారిపోవ‌టం తెలిసిందే. దీంతో.. సొంత ప్ర‌జ‌లైన సీమాంధ్రులు సైతం వెంక‌య్య‌ను ఛీ కొట్టే ప‌రిస్థితి. అంతుంది.. ఇంతుంద‌ని చెప్పుకునే నేత‌.. జ‌న్మ‌నిచ్చిన ప్రాంతం కోసం అధినేత మ‌న‌సును ఆక‌ట్టుకోవ‌ట‌మో.. లేదంటే ఒత్తిడి తేవ‌ట‌మో చేసే క‌న్నా.. భ‌జ‌న కార్య‌క్ర‌మం పెట్టిన తీరు స‌గ‌టు సీమాంధ్రుడి ఒళ్లు మండేలా చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఇదిలా ఉండ‌గా.. వెంక‌య్య‌నాయుడి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఈ నెలాఖ‌రుతో పూర్ది కానుంది.

మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంపేందుకు వీలుగా ఆయ‌న్ను క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి.

ఇందులో నిజం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఊహించ‌ని వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ రాష్ట్రం నుంచి వెంక‌య్య‌ను ఎంపిక చేయొద్దంటూ క‌ర్ణాట‌క కు చెందిన ప‌లువురు ట్విట్ట‌ర్ లో చేస్తున్న విమ‌ర్శ‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క అసెంబ్లీలో బీజేపీకి ఉన్న బ‌లం రీత్యా.. ఒక్క స్థానం నుంచి విజ‌యం సాధించే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. దీన్ని వెంక‌య్య‌కు క‌ట్ట‌బెట్టాల‌న్న అధినాయ‌క‌త్వం ఆలోచ‌న‌ను క‌న్న‌డిగులు విప‌రీతంగా వ్య‌తిరేకించ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రి.. సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల మీద బీజేపీ దృష్టి పెడుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న అయ్యింది. అయినోళ్లు వెంక‌య్య‌ను ఛీ కొట్ట‌టం ఒక ఎత్తు అయితే.. క‌న్న‌డిగులు కూడా నో అంటే నో అన‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా  మారింది.
Tags:    

Similar News