టెర్రరిస్టులు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో.. ఏం చేసి ప్రాణాలు తీస్తారో తెలియని పరిస్థితి. ఇటీవల రైలు ప్రమాదాలే అందుకు ఉదాహరణ. ఇంతకాలం ప్రమాదాలే అని నమ్ముతూ వచ్చిన ట్రైన్ యాక్సిడెంట్లు ప్రమాదవశాత్తు జరిగినవి కావని - ఉగ్రవాదులు బాంబులు పెట్టడం వల్ల జరిగినవని తేలింది. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ ఐ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు పోలీసుల విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇండో నేపాల్ సరిహద్దులో ముగ్గురు ఐఎస్ ఐ ఏజంట్లు ఉమా శంకర్ పటేల్ - మోతీలాల్ పాశ్వాల్ - ముకేష్ యాదవ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు - వారిని విచారించగా - కాన్పూర్ సమీపంలో గత సంవత్సరం జరిగిన రెండు రైలు ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని వెల్లడైంది. రైల్వే ట్రాక్ కింద బాంబులు అమర్చినట్టు వీరు ఒప్పుకున్నారని విచారణ వర్గాలు చెబుతున్నాయి.
ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 150 మంది మరణించగా - వందలాది మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పట్టాల కింద అమర్చిన బాంబులు పేలడమే కారణమని తేలింది. భారత్ లో కొత్త రకం ఉగ్రవాదానికి పాక్ ప్రేరేపిత ఐఎస్ ఐ ఉగ్రవాదులు తెగబడుతున్నారని.. రూటు మార్చి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఇంటిలిజెన్సు వర్గాలు చెబుతున్నాయి.
కాగా దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత ఉగ్రవాదం కొంతవరకు అదుపులోకి వచ్చింది. పాకిస్థాన్ వైపు నుంచి మన నకిలీ కరెన్సీ సప్లయి తగ్గడంతో ఉగ్రవాదులకు నిధుల రాక కొంతవరకు ఆగింది. దీంతో కొద్దికాలంగా కార్యకలాపాలు నెమ్మదించాయనే చెప్పాలి. అయితే.. ఈ కట్టడిని కొనసాగించడం అన్నది కీలకం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/