కాలేజీకి స్టూడెంట్స్ తుపాకీల్ని తీసుకెళ్లొచ్చ‌ట‌

Update: 2017-07-02 07:24 GMT
గ‌న్ క‌ల్చ‌ర్ అమెరికాను ఎంత ర‌క్త‌సిక్తం చేస్తున్న‌దో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. మ‌న ద‌గ్గ‌ర ప‌ప్పు బెల్లాలు కొన్నంత ఈజీగా అమెరికాలో గ‌న్ కొనుగోలు చేసే వెసులుబాటు ఉండ‌టం తెలిసిందే. ఆయుధాల మీద నియంత్ర‌ణ పెంచాల‌న్న వాద‌న ఓప‌క్క జోరుగా వినిపిస్తున్న వేళ‌.. అగ్ర‌రాజ్యంలోని క‌న్సాస్ రాష్ట్రం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది.

ఇప్ప‌టికే ఉన్న అయుధ చ‌ట్టాల‌పై విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్న‌వేళ‌.. తాజాగా కాలేజీల‌కు సైతం స్టూడెంట్స్ తుపాకీలు తీసుకెళ్లేందుకు వీలుగా అనుమ‌తిస్తూ క‌న్సాస్ రాష్ట్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇదే త‌ర‌హాలో ఆయుధాల‌తో కాలేజీల‌కు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా అర్క‌న్సాస్‌.. జార్జియా స‌హా ప‌లు రాష్ట్రాలు ఓకే చేస్తున్నాయి.

ఇటీవ‌ల కాలంలో గ‌న్ క‌ల్చ‌ర్ పెరిగి.. చిన్న చిన్న విష‌యాల‌కే తుపాకీలు వాడేస్తుండ‌టంతో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌ర‌చూ ఎదుర‌వుతోంది. ఇలాంటి వేళ‌.. ఆయుధాల వినియోగంపై ప‌రిమితులు తీసుకురావాల‌న్న వాద‌న ఈ మ‌ధ్య‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. క‌న్సాస్ రాష్ట్రం తీసుకున్న నిర్ణ‌యంతో అక్క‌డి వారు షాక్‌కు గురి అవుతున్నార‌ని చెబుతున్నారు. కాలిఫోర్నియాతో స‌హా ద‌క్షిణ క‌రోలినా తో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో విద్యార్థులు.. ఉపాధ్యాయులు త‌మ వెంట తుపాకుల్ని కాలేజీల‌కు తీసుకెళ్ల‌టాన్ని నిషేధించాయి. అయితే.. అందుకు భిన్నంగా కాలేజీకి విద్యార్థులు తుపాకీలు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీసుకోవ‌టంతో  పెద్ద ఎత్తున ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తుపాకులు వెంట తెచ్చుకునే విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌టం పిచ్చి ప‌నిగా ప‌లువురు అధ్యాప‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే వేరే ఉద్యోగం చేస్తాను కానీ.. తాను చేస్తున్న అధ్యాప‌క వృత్తిని మాత్రం చేసేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు ప‌లువురు అధ్యాప‌కులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News