విజయవంతమైన కెప్టెన్ అంటే ఊరికే కాడు, అది మామూలు విషయం కాదు. ఇప్పటికీ అలాంటి విజయవంతమైన నాయకుడే తను అనిపించుకుంటున్నాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. ప్రస్తుతం 1983లో ఇండియా క్రికెట్ ప్రపంచకప్ ను నెగ్గడం గురించి ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ఘట్టం అది. ఆ ఈవెంట్ గురించి సినిమా రూపొందుతూ ఉంది.
ఆ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తూ ఉన్నాడు. తాజాగా ఆ సినిమా పై కపిల్ స్పందించాడు. ఆ స్పందన కపిల్ లోని గొప్ప కెప్టెన్ ను మరోసారి ఆవిష్కరిస్తోంది.
1983లో ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్ ను గెలవడం గురించి సినిమాను ఆహ్వానించిన కపిల్ ఇప్పటికే ఆ సినిమాకు తన వంతు సహకారం అందించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ... ఆ సినిమాలో తన పాత్రను ఎక్కువగా హైలెట్ చేయక పోతే బావుంటుందని అన్నాడు. ఆ విజయంలో అప్పటి టీమ్ లోని అందరి వాటా ఉందని, వారిలో తను కూడా ఒకడు అన్నట్టుగా కపిల్ స్పందించారు.
తన వల్లనే టీమిండియా నెగ్గినట్టు గా సినిమాలో చూపక పోతే బావుంటుందని, తన పాత్రను హైలెట్ చేయకపోతేనే మేలని కపిల్ అన్నాడు. వాస్తవానికి ఆ ప్రపంచకప్ లో కపిల్ అద్భుతంగా ఆడారు. జింబాబ్వే చేతి లో కూడా ఓడిపోవాల్సిన మ్యాచ్ లో 175 పరుగులు చేసి.. జట్టును విజయపథంలో నిలిపాడు కపిల్. ఆ మ్యాచ్ తోనే వరల్డ్ కప్ లో టీమిండియా ముందుకు వెళ్లగలిగింది. అయినా క్రికెట్ టీమ్ గేమ్ కాబట్టి.. అందరి సహకారాన్ని కపిల్ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సినిమాలో ఆ విషయాలన్నింటినీ చూపాలంటున్నాడు.