రాముడికి.. ట్రిపుల్ త‌లాక్‌ కు ముడిపెట్టేశాడే

Update: 2017-05-16 09:40 GMT
లాయ‌ర్ త‌లుచుకుంటే ఎంత‌? అంటూ పాత‌కాలం రోజుల్లో పెద్దోళ్ల నోట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా.. య‌వ్వారాన్ని చ‌దివిన‌ప్పుడు ఇదే మాట గుర్తుకు రాక మాన‌దు. ప్ర‌స్తుతం ట్రిపుల్ త‌లాక్ ఉదంతం హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇప్పుడు ఆస‌క్తిక‌ర వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ట్రిపుల్ త‌లాక్ పై ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు త‌న వాద‌న‌ల్ని వినిపించింది.

ఈ సంద‌ర్భంగా వారి త‌ర‌ఫున కేంద్ర‌మాజీ మంత్రి.. సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబాల్ త‌న వాద‌న‌ల్ని వినిపిస్తూ.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీశారు.

ట్రిపుల్ త‌లాక్ 1400 ఏళ్లుగా కొన‌సాగుతున్న ఓ విశ్వాసంగా చెప్పిన ఆయ‌న‌.. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ముస్లింలు ట్రిపుల్ త‌లాక్‌ను పాటిస్తున్నార‌న్నారు. ఇది మ‌త విశ్వాసాల‌కు సంబంధించిన విష‌యం అయిన‌ప్పుడు.. రాజ్యాంగ బ‌ద్ధ‌త‌.. స‌మాన‌త్వం ప్ర‌శ్న ఉద‌యించ‌ద‌ని వాదించారు.

హిందులు ఎలా అయితే రాముడు అయోధ్య‌లో జ‌న్మించిన‌ట్లుగా న‌మ్ముతున్నారో.. అలానే ట్రిపుల్ త‌లాక్ ను కూడా ముస్లింలు విశ్వ‌సిస్తున్న‌ట్లుగా సిబాల్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఒక వాద‌న‌ను వినిపించాల‌న్న‌ప్పుడు.. త‌న వాద‌న‌ను సూటిగా స్ప‌ష్టంగా వినిపించాలే కానీ.. సంబంధం లేని అంశాల్ని ముడి పెట్టేసి.. వాద‌న‌లు వినిపించ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

రాముడు అయోధ్య‌లో పుట్టాడ‌న్న విశ్వాసం కార‌ణంగా.. ఏ జీవితం ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావితం కావ‌టం లేద‌న్న విష‌యం సిబాల్ లాంటి వారికి ఎందుకు గుర్తుకు రాదో? అయోధ్య‌లో రాముడు జ‌న్మ విష‌యం హిందువుల న‌మ్మ‌కంతో ఏ హిందువు కూడా వ్య‌క్తిగ‌తంగా న‌ష్ట‌పోతున్న‌ది లేదు. అదే స‌మ‌యంలో.. ట్రిఫుల్ త‌లాక్ కార‌ణంగా త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని.. ముస్లిం మ‌హిళ‌లు ప‌లువురు బాహాటంగానే త‌మ వాద‌న‌ను వినిపిస్తున్న వేళ‌.. రాముడితో ట్రిపుల్ త‌లాక్ కు లింకు పెట్ట‌టం ఏమిట‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు విరుద్ధ అంశాల్ని జ‌త చేసేసి.. వాదించ‌టం ద్వారా విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్లు అవుతుంద‌ని.. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్న మాట సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. ఏమైనా.. సిబాల్ త‌న వాద‌నా ప‌టిమ‌తో ట్రిఫుల్ త‌లాక్ అంశంలోకి రాముడ్ని తీసుకొచ్చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News