ఏపీలో బలమైన సామాజికవర్గంగా కాపులు ఉన్నారు. వారు రాజకీయంగా తమ వాటా కోసం ఒక వైపు పోరాటం చేస్తున్నారు. మరో వైపు చూస్తే కాపులకు సామాజికంగా రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి చేయలేకపోయింది. కానీ కాపులను ఆర్ధికంగా వెనకబడిన అగ్ర వర్ణాలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా కొన్ని అడుగులు వేసింది.
ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాపులను బీసీలలో కలిపే అంశం తన చేతుల్లో లేదని జగన్ ఎన్నికల వేళ చెప్పేశారు. అయితే కాపులు ఇపుడు అయిదు శాతం రిజర్వేషన్లు ఈబీసీ కోటాలో అడుగుతున్నారు. మరి దాన్ని చేయడానికి అభ్యంతరం ఏమిటి అన్నదే ప్రశ్నగా ఉంది.
ఇంతకాలం పది శాతం రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టులో కేసు ఉందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇపుడు అక్కడ కూడా కేసు ఏదీ లేదని తెలిసినా రిజర్వేషన్ల మీద మాట్లాడడంలేదు. దాంతో కాపులు రగులుతున్నారు. ఈ విషయం మీద కాపు సంక్షేమ సేన అధ్యక్షుడుగా ఉన్న మాజీ మంత్రి హరిరామజోగయ్య హై కోర్టులో ప్రజా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
కాపులకు అగ్ర వర్ణాల రిజర్వేషనలో అయిదు శాతం ఇవ్వాలని ఆయన కోరారు. ఆ దిసగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం మీద చాలా పిటిహన్లు కోర్టులో పడ్డాయి. అన్నింటికీ ఒకే దానికి కలుపుతూ ఈ కేసుని హై కోర్టు విచారిస్తోంద్.
కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలని కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు కోరింది. అన్ని విషయాలు క్రోడీకరించుకుని కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున లాయర్ కోర్టుకు చెప్పారు. ఈ కేసు వచే నెల 26కు వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెబుతుంది అన్నదే ఆసక్తిగా మారింది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున బీసీలుగా ఉన్న బోయలను వాల్మీకి కులంలో కలపాలని , ఎస్టీ హోదా ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. అలాగే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని మరో తీర్మానం చేసింది. ఈ రెండు తీర్మానాలను జగన్ స్వయంగా సభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకున్నారు.
అదే చేత్తో కాపులను బీసీలలో కలపాలని కేంద్రాన్ని కోరుతూ ఇంకో తీర్మానం చేసి పంపితే పోయేది ఏముంది అన్న చర్చ వచ్చింది. దాని కంటే ముందు తన చేతిలో ఉన్న అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తే సరిపోతుంది కదా అన్న పాయింటూ ఉంది. నిజానికి కాపులను బీసీలలో కలపడం అంటే బీసీలు ఆగ్రహిస్తారని, వారి ఓట్లు పోతాయని బెంగ ఉండవచ్చు. అయిదు శాతం ఈబీసీలో ఇస్తే మిగిలిన అగ్ర వర్ణాల నుంచి ఏ రకమైన అభ్యంతరం ఉండే చాన్సే లేదు అంటున్నారు.
పైగా వారు వైసీపీకి పెద్ద ఓటు బ్యాంక్ గా లేరు. కాపులకు అయిదు శాతం ఇస్తే వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం ఈ అంశాన్ని క్లెయిం చేసుకోవచ్చు అని వైసీపీలో మాట వినిపిస్తోంది. కానీ జగన్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నారో తెలియడంలేదు అని అంటున్నారు. జగన్ సర్కార్ వైఖరి ఏంటి అసలు కాపుల రిజర్వేషన్ల మీద వైసీపీ స్టాండ్ ఏంటి అన్నది సర్కార్ దాఖలు చేసే కౌంటర్ లో తేటతెల్లం అవుతుంది అని అంటున్నారు. ఈ కౌంటర్ ఒక విధంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే చాన్స్ కూడా ఉంటుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.