నాకు కులం లేదన్న పెద్ద మనిషి.. అందుకుతగ్గట్లే ఉండాలి. కానీ.. మాటల్లో కులం లేదనే పవన్ కల్యాణ్.. తన పార్టీలోనూ.. తన చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ మందిని తన కులానికి చెందిన వారినే ఉంచుతారన్న విమర్శ ఉంది. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. కులానికి ప్రాధాన్యత ఇవ్వని పవన్ కల్యాణ్.. తన కులమైన కాపులు ఎక్కువగా ఉంటే రెండు నియోజకవర్గాల్ని వెతికి వెతికి మరీ ఎంపిక చేసుకోవటం దేనికి నిదర్శనం.
చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతని లేనప్పుడు.. తమను పులుసులో ములక్కాయ అనుకునే పవన్ కు భలేగా షాకిచ్చారు కాపులు. మెగా ఫ్యామిలీకి కాపుల పేర్లు చెప్పి రాజకీయాలు చేయటమే తప్పించి.. వారికి ఏమీ చేయలేదన్న మాటకు తగ్గట్లే.. వారి తీరుకు భలేగా బదులిచ్చినట్లుగా చెబుతన్నారు. గతంలో చిరంజీవికి షాకిచ్చిన ఆ వర్గం.. తాజాగా పవన్ కు సైతం అదే తరహాలో షాకిచ్చినట్లుగా చెప్పాలి.
పవన్ కల్యాణ్ రెండు చోట్ల బరిలో నిలిచారు. నరసాపురం.. గాజువాకలో బరిలో దిగిన పవన్ కు.. రెండు చోట్ల ఓటమి తప్పేటట్లు లేదు. గాజువాకలో హోరాహోరీగా ఉన్నప్పటికీ.. నరసాపురంలో మాత్రం దారుణ పరాజయం ఆయన ఖాతాలో పడనున్నట్లుగా చెప్పాలి. తాజాగా వెలువడిన రౌండ్ ఫలితాలు చూస్తే.. పవన్ మూడోస్థానంలో ఉంటే.. రెండు స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. మొదటి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఉండటం గమనార్హం.
బాబుకు పరోక్షంగా మేలు చేసేలా పవన్ వ్యవహరించారన్న మాట కూడా ఆయన పార్టీని దారుణంగా దెబ్బ తీసిందని చెప్పాలి. ఓట్ల చీలికకు కీలకంగా మారుతానని భావించిన పవన్ కు.. ఏపీ ప్రజలు ఊహించని షాకిచ్చారు. గంప గుత్తగా ఓట్లేసి మరీ తమ తీర్పు ఏమిటన్న విషయాన్ని చెప్పేశారు. రాజకీయ లబ్థి కోసం అవసరమయ్యే కాపులు.. మాట వరసకు కూడా పనికి రారన్నట్లుగా వ్యవహరించిన వపన్ శైలికి తగ్గట్లే ఆయనకు సరైన రీతిలో బదులిచ్చినట్లుగా చెప్పక తప్పదు.