కాపులకు అంతకు'మించి'

Update: 2016-03-16 08:08 GMT
బీసీల్లో చేర్చాలని కోరుతున్న కాపులకు ప్రయోజనాలు, లబ్ధి చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ ఈ సంగతి తాజాగా వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న కాపు విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ లు ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రామానుజయ చెప్పుకొచ్చారు.

కాగా బీసీల్లో చేర్చాలని పోరాడుతున్న కాపుల కోసం ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించారు. యువతకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తాజాగా స్కాలర్ షిప్ లకు కూడా మార్గం వేస్తుండంతో బీసీ హోదా లేనప్పటికీ బీసీలకు దక్కే ప్రయోజనాలన్నీ కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లయింది. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చేందుకు గాను వారి సామాజిక - ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి కమిషన్ ను వేశారు. ఈ నేపథ్యంలో ఓవైపు ప్రక్రియ సాగుతుండగానే స్కాలర్ షిప్ ల దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం కాపులకు శుభపరిణామమే.
Tags:    

Similar News