కాపుల టోన్ వింటున్నారా... టీడీపీ జాగ్ర‌త్త ప‌డాల్సిందే...!

Update: 2022-11-21 13:30 GMT
టీడీపీ నేత‌ల‌కు ఒకింత షాక్ ఇచ్చే ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో చేతులు క‌ల‌పాల‌ని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ విష‌యంలో జ‌న‌సేన నాయ‌కులు, ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారు చాలా మేర‌కు దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎంత సేపూ.. చంద్ర‌బాబు అంటూ.. ఆయ‌న భ‌జ‌న చేయ‌డం ఎందుకు? అనే మాట ఈ వ‌ర్గం నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఎందుకు ఎలివేట్ చేయ‌కూడ‌ద‌నే డిమాండ్లు కూడా ఈ వ‌ర్గం నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సెగ ఉంటుంద‌ని తెలిసినా.. ఈ రేంజ్‌లో ఉంటుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు.

తాజాగా జ‌రిగిన వ‌న‌భోజ‌నాల కార్య‌క్ర‌మంలో కాపు సామాజిక వ‌ర్గంలోని కొంద‌రు నాయ‌కులు అటు వైసీపీ, ఇటు టీడీపీ అధినేత గురించి ప్ర‌స్తావించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే, దీనిని కాపుయువ‌త తీవ్రంగా ఖండించారు. ఎంత సేపూ.. జ‌గ‌నూ, చంద్ర‌బాబుల గురించేనా, మ‌న కాపు నాయ‌కుడు రంగంలోకి దిగితున్నాడు. ఆయ‌న గురించి ప‌ట్టించుకోరా? అంటూ వారు నిల‌దీశారు.

అంతేకాదు, ఇలాగే ఉంటే మేం ఏంచేయాలో మాకు తెలుసు. అని గ‌ట్టిగానే మాట్లాడారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపించ‌డంతో రాజ‌కీయంగా కుదుపు ఏర్ప‌డింద‌నే చెప్పాలి.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నసేన‌-టీడీపీ క‌లిస్తే ఏదో అద్భుతం జ‌రుగుతుంద‌ని అనుకున్నా క్షేత్ర‌స్థాయిలో మాత్రం అస‌లు ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఒక్కొక్క విష‌యం వెలుగు చూస్తుండ‌డంతో రాజ‌కీయంగా టీడీపీ జాగ్ర‌త్త ప‌డ‌డ‌మే మంచిద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News