కాపులకు రిజర్వేషన్ విషయం.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేద ని..కేంద్రాన్ని సీఎం జగన్ తిడుతున్నారని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ విరుచుకుపడ్డారు. ఇక, కాపులకు రిజర్వే షన్ ఇచ్చే విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. మరోవైపు.. టీడీపీ ఈ విషయంపై సైలెంట్‌గా ఉంది. ఇక, వైసీపీ అసలు ఇది సాధ్యం కాదని కూడా చెప్పేసింది.
ఈ మొత్తం పరిణామంలో ఇప్పుడు అనూహ్యంగా కాపుల రిజర్వేషన్ అంశం తెరమీదికి రావడం.. ఆసక్తిగా మారింది. దీని పూర్వాపరాలు పరిశీలిస్తే.. ఎవరు దొంగ అనేది తేలిపోతుంది. 2019 ఎన్నికలకు ముందు గుజరాత్‌లో పటేల్‌సామాజిక వర్గం తమకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసింది. ఇది తన పుట్టి ముంచుతుందని భావించిన ప్రధాని మోడీ రాత్రికి రాత్రి అనూహ్యంగా అగ్రవర్ణ(పటేల్‌లు) పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేశారు.
ఎన్నికలకు రెండు మాసాల ముందు దీనిని తీసుకురావడంతోపాటు.. దీనిని రాష్ట్రాల స్వేచ్ఛకు వదిలేశారు. అయితే.. ఇక్కడే చిన్న మెలిక పెట్టారు. "మీరు రిజర్వేషన్ ఇచ్చుకోండి.. కానీ, ఆ ఇచ్చేముందు.. కేంద్ర హోం శాఖ(అంటే.. మోడీ సర్కారు) అనుమతి తప్పదు" అని క్లాజ్ చేర్చారు. దీంతో అప్పటి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కాపులనుమచ్చిక చేసుకుని గుండుగుత్తగా పదిశాతంలో ని 5 శాతాన్ని.. కాపులకు ఇచ్చేసింది. క్లాజ్ ప్రకారం అసెంబ్లీ తీర్మానాన్ని.. కేంద్ర హోం శాఖకు పంపించింది.
అయితే.. దీనిపైనిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం తొక్కి పెట్టేసింది. దీనికి టైం అంటూ.. లేదు. ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చని.. ప్రకటించింది. ఇప్పటికీ.. ఇది హోం శాఖ పరిధిలోనే ఉంది. ఇక, వైసీపీకిఈ విషయం తెలిసిందో ఏమో.. లేక రెడ్డి వర్గం తమకు దూరమవుతుందనుకుందో.. మేం అంత ఇవ్వలేం.. అని చేతులు ఎత్తేసింది. ఈ అక్కడితో అయిపోయింది.
కానీ, ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరమీదికి వచ్చిందంటే.. మళ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ముందు జీవీఎల్ ఏమైనా చేయాలని అనుకుంటే.. కేంద్రానికి చంద్రబాబు పంపిన తీర్మానంపై సమాధానం చెప్పాలి. లేకపోతే.. మౌనంగా ఉండాలి. ఇలా రాజకీయ ఆట ఆడడం ఎందుకు? అనేది ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.