ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ రెండో దశ ఇటు వైసీపీలో, అటు టీడీపీలో చర్చనీయాంశంగా మారుతోంది. నాయకుల జంపింగ్‌లతో వైసీపీ చిగురుటాకులా వణికిపోతుండగా...టీడీపీ నాయకులు కొత్త నేతలు వస్తే తమ సంగతి ఏమవుతుందో అని లోలోపల చర్చించుకుంటున్నారు. జంపింగ్ ఎపిసోడ్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లో కరణం బలరాం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పార్టీ ఫిరాయిస్తున్న నేతలతో ఏనాటికైనా, కొన్ని ప్రాంతాల్లోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలంటే, పార్టీ అధిష్టానం తనతో సంప్రదిస్తుందని భావిస్తున్నట్లు బలరాం ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో తనకున్న సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు. 30 ఏళ్లకు ముందు తామెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని స్పష్టం చేశారు.