వేదిక ఏదైనా సరే.. ఏ చిన్న అవకాశం లభించినా.. జనసేన అధినేతపై ఏపీ టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏదో విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. చివరకు సీఎం కుర్చీ వద్దకు విషయాన్ని తీసుకెళ్లటం అలవాటుగా మారింది. తాజాగా.. అదే తరహాలో మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రులు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని షెడ్యూల్ 9లో పెట్టి.. ఆ చట్టాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఎస్సీ.. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ నేతృత్వంలో భారీ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు దళితుల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడిన వారు.. పవన్ కల్యాణ్ ముచ్చటను తెర మీదకు తెచ్చారు.
సినిమా హీరోలంతా ముఖ్యమంత్రులు కాలేరని.. అలా కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలంటూ మండిపడ్డారు. అలాంటిది పవన్ వల్ల సాధ్యం కాదని.. అన్న ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. పవన్ కు సీఎం సీటు దక్కదంటూ టీడీపీ దళిత మంత్రులు మండిపడ్డారు.
"మిస్టర్ పవన్ కల్యాణ్.. మీకు సీఎం సీటు దక్కదు.. ముందు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోండి.. ప్రజల ప్రేమాభిమానులు అందుకోండి" అంటూ వారు ఫైర్ అయ్యారు. దేశంలో రోజుకు ఆరుగురు దళిత మహిళలపై అత్యాచారం.. ప్రతి 15 నిమిషాలకో దాడి జరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ..ఎస్టీలకు అండగా నిలిచే చట్టాన్ని నిర్వీర్యం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎస్సీ.. ఎస్టీ చట్ట పరిరక్షణ ర్యాలీలో పవన్ మాట రావటం తప్పని చెప్పలేం కానీ.. సంబంధం లేకుండా సీఎం సీటుతో ముడిపెట్టి పవన్ పై తెలుగు తమ్ముళ్లు ఫైర్ కావటం గమనార్హం.