పక్కా హిందుత్వ వాది, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా మాట్లాడే వారంతా దేశ ద్రోహులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకించే వాళ్లను బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్ కు పంపిస్తామంటూ హెచ్చరికలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన భారీ బీజేపీ ప్రదర్శనలో పాల్గొన్న బండి సంజయ్ ఈ మేరకు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ 10 నిమిషాలు టైమిస్తే హిందువులను ఖతం చేస్తామని అన్నప్పుడు కేసీఆర్ - కేటీఆర్ ఎక్కడున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ద్రోహుల్లారా ఖబడ్దార్ మీరు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం.. మీరు కట్టెలుపడితే మేం కత్తులు పడతాం.. యుద్ధం మొదలైంది.. ఎవరిని వదలం ’అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
దేశంలో విచ్చిన్నం సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రణాళిక ప్రకారం కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లుంబినీ పార్కులో బాంబులు వేసిన వారికి దేశ పౌరసత్వం ఇమ్మంటారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.