క‌ర్నాట‌క బీజేపీ నేత వీడియోల కేసు.. సిట్ విచార‌ణ పూర్తి.. ఏం చెప్పిందంటే?

Update: 2021-07-28 01:30 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌.. క‌ర్నాట‌క జ‌ల‌వ‌న‌రుల మాజీ మంత్రిగా ప‌నిచేసిన ర‌మేష్ జార్కిపై వ‌చ్చిన సెక్స్ వీడియోల ఆరోప‌ణ‌లు ఎంత సంచ‌ల‌నం రేకెత్తించాయో అంద‌రికీ తెలిసిందే. ఉద్యోగం కోసం వెళ్తే త‌న‌ను లోబ‌రుచుకున్నాడంటూ ఓ యువ‌తి ఈ ఏడాది మార్చిలో విడుద‌ల చేసిన వీడియోలు దేశ‌వ్యాప్తంగా అల‌జ‌డి సృష్టించాయి.

ఈ విష‌యానికి సంబంధించి స‌ద‌రు యువ‌తి అజ్ఞాతంలో ఉంటూ వ‌రుస వీడియోలు, ఆడియో టేపులు విడుద‌ల చేసింది. ఆ వీడియోల్లో అప్ప‌టి మంత్రిగా ఉన్న‌ ర‌మేష్ జార్కి త‌న‌ను వేధిస్తున్నార‌ని, ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోరింది. త‌న‌కు, త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన త‌ర్వాతే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని, పోలీసు అధికారుల ముందు కూడా హాజ‌ర‌వుతాన‌ని కూడా ఆ వీడియోలో చెప్పింది.

ఆ త‌ర్వాత ప‌లు మ‌లుపుల అనంత‌రం.. ఈ వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చేందుకు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ అధికారులు విచార‌ణ మొద‌లు పెట్టారు. జార్కి హోళీ, స‌ద‌రు యువ‌తి ఏకాంతంగా గ‌డిపిన బెడ్ రూమ్ కు సైతం వెళ్లారు. మ‌ల్లేశ్వ‌రం స‌మీపంలోని ఓ విలాస‌వంత‌మైన అపార్ట్ మెంట్లో ఈ వ్య‌వ‌హారం సాగింద‌ని, అది ర‌మేష్ జార్కీకి చెందిన అపార్ట్ మెంట్ అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అక్క‌డికి స‌ద‌రు యువ‌తిని కూడా తీసుకెళ్లి సిట్‌ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

అయితే.. ఈ ఆరోప‌ణ‌లు కుదిపేయ‌డంతో త‌న మంత్రి ప‌ద‌వికి ర‌మేష్ జార్కి రాజీనామా చేశారు. ఈ విష‌యంతో త‌న‌కు సంబంధం లేద‌ని, అవ‌న్నీ ఆరోప‌ణ‌లేన‌ని ఖండించారు. ఆ వీడియో ఫేక్ అని చెప్పారు. అంతేకాకుండా.. ఆ వీడియో సీడీ గురించి త‌న‌కు నాలుగు నెల‌లు ముందుగానే తెలుస‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సీడీ విడుద‌ల‌కు ఒక రోజు ముందుగానే బీజేపీ నేత‌లు త‌న‌కు ఫోన్ చేసి అల‌ర్ట్ చేశార‌ని చెప్పారు. ఈ ఫేక్ వీడియో కుట్ర‌లో న‌లుగురు రాజ‌కీయ నాయ‌కులు, ముగ్గురు జ‌ర్న‌లిస్టులు, ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు, వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని వ్యాఖ్యానించారు

ఇక‌, ఇదే విష‌య‌మై ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి హెచ్ డీ కుమార‌స్వామి కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఇదంతా ముంద‌స్తు ప‌థ‌కం ప్ర‌కార‌మే చేశార‌ని ఆరోపించారు. ఈ సెక్స్ వీడియోల వెనుక రూ.5 కోట్ల డీల్ కుదిరింద‌ని బాంబు పేల్చారు. అయితే.. అది ఎవ‌రి మ‌ధ్య కుదిరింది? ఈ చర్య వెనకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అన్న‌ది మాత్రం ఆయన వెల్ల‌డించ‌లేదు.

ఈ విధంగా క‌న్న‌డనాట తీవ్ర అల‌జ‌డి రేకెత్తించిన ఈ అంశంపై సిట్ నివేదిక ఇచ్చింది. ర‌మేష్ జార్కిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాల్లేవ‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. మాజీ మంత్రి ర‌మేష్ ను ముగ్గులోకి లాగేందుకే ఒక గ్యాంగ్ స‌ద‌రు మ‌హిళ‌ను ఉప‌యోగించుకుంద‌ని, దీన్ని ఒక ‘హనీ ట్రాప్’గా పేర్కొంది.

గతంలోనే కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై (ప్రస్తుతం ముఖ్యమంత్రి) ఈ గ్యాంగ్ గురించి చెప్పారు. సదరు మహిళను రమేష్ జార్కి వద్దకు పంపి, రహస్యంగా వారి రాసలీలను వీడియోగా తీసి ఆయన్ను బ్లాక్ మెయిల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారని ఆరోపించారు. ఇప్పుడు సిట్ కూడా అదే నిజ‌మ‌ని తేల్చ‌డం విశేషం. దీంతో.. రమేష్ జార్కి కి క్లీన్ చిట్ లభించినట్టైంది.
Tags:    

Similar News