కొడుకు కోసం పోర్న్ స్టార్ సంబంధం వెతుకుతున్న కర్నాటక ఎమ్మెల్యే

Update: 2018-12-19 15:25 GMT
తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడకు గడ్డి కోసం అన్నాడట వెనుకటికి ఎవరో.. కర్నాటక బీఎస్పీ ఎమ్మెల్యే పద్ధతీ అలాగే ఉంది. అసెంబ్లీలో కూర్చుని హాట్ హాట్ అమ్మాయిల ఫొటోలను తన ఫోన్లో చూస్తున్న ఆయన్ను  ‘‘హవ్వ.. ఇలాంటి ఫోటోలు చూస్తారా ఎమ్మెల్యేగారూ.. ’’ అంటే ఆయన ఏం సమాధానం చెప్పారో తెలుసా? తన కొడుక్కోసం మంచి సంబంధం చూస్తున్నానని.. అందుకే అమ్మాయిల ఫొటోలు చూస్తున్నానని చెప్పారట.
    
మహేశ్‌ అనే బీఎస్పీ నేత సోమవారం కర్నాటక అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఫోను తీసి ఆడవాళ్ల ఫొటోలు చూస్తున్నారు. ఇది కాస్త మీడియా కంట్లో పడడంతో వారు జాగ్రత్తగారికార్డు చేసేశారు. ఇంకేముంది.. టీవీల్లో రావడంతో ఎమ్మెల్యేగారు పాపం కంగారు పడిపోయి తన కొడుకు పరువును కూడా బజారుకీడ్చారు. ‘‘మా అబ్బాయి కోసం సంబంధాలు చూస్తున్నాం. మంచి అమ్మాయి దొరుకుతుందేమోనని ఫొటోలు చూశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను’’ అని చెప్పారు.
    
అయినా.. డామేజ్ కంట్రోల్ అయినట్లు అనిపించకపోవడంతో ఇక మీడాయాపై చిందులేశారట. కర్నాటక ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో కూర్చుని అందాలు చూడడం కొత్తేమీ కాదు. 2016లో ప్రభు చవాన్‌ అనే భాజపా నేత అసెంబ్లీలో కూర్చుని ఒక రాజకీయనాయకురాలి ఫొటోను చూస్తూ మీడియా కళ్లకు చిక్కారు. దాంతో ఆయన్ని ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి అసెంబ్లీలో ఫోన్లను బ్యాన్ చేశారు. కానీ,, ఈ ఎమ్మెల్యే ఫోనూ తీసుకెళ్లారు.. పోరీలనూ చూశారు.
Tags:    

Similar News