లేటు వయస్సులో ఆ సీఎంకి రెండోసారి వచ్చేసింది!

Update: 2021-04-16 11:30 GMT
కరోనా వైరస్ .. ఈ మహమ్మారికి చిన్నా, పెద్ద, పేద..ధనిక అన్న తేడా ఏం లేదు. 2019 చివర్లో మొదలైన ఈ మహమ్మారి విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్ లో మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. గతం కంటే ఇంకా ఎక్కువ ఉదృతంగా కరోనా జోరు కొనసాగుతుంది. గత వారం రోజులుగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లోనే రెండు లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే .. ఈ సెకండ్ వేవ్ లో ముఖ్యంగా ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , మంత్రులు , ముఖ్యమంత్రులు కరోనా భారిన పడుతున్నారు. తాజాగా  కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప కరోనా బారిన పడ్డారు. ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో రెండ్రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో శుక్రవారం బెంగళూరులోని రామయ్య మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీనితో ప్రస్తుతం కరోనా  చికిత్స అందిస్తున్నారు.  గతేడాది ఆగస్టులో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని , తాను బాగానే ఉన్నానని కాని వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను అని , కొద్దిగా జ్వరం రావడంతో మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనితో ఇటీవల తనను కలవడానికి వచ్చిన వారందరినీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని కోరారు. సీఎం యడ్యూరప్పతో కరోనా పరిస్థితి పై రాష్ట్ర అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. కరోనా దారుణ పరిస్థితులపై చర్చించారు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆ భేటీకి హాజరైన వారందరూ కూడా కరోనా టెస్టుకి సిద్ధం అవుతున్నారు.
Tags:    

Similar News