సీఎం ఆర్డ‌ర్: క్రూరంగా చంపేయండి

Update: 2018-12-25 07:00 GMT
కొద్దికాలంగా రాజ‌కీయ అనిశ్చితిలో స‌త‌మ‌త‌మ‌వుతున్న కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌ డీ కుమారస్వామిని ఓ వీడియో వివాదంలో ఇరికించింది. 'క్రూరంగా చంపేయండి' అంటూ ఆదేశాలిస్తున్న ఆయన ఒక వీడియోలో చిక్కారు. తన పార్టీ(జేడీఎస్‌)కు చెందిన స్థానిక నేత ప్రకాశ్‌ హంతకులను విచక్షణారహితంగా చంపేయండి అంటూ (పోలీసులకు) ఆదేశాలిస్తున్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. 'ఆయన(ప్రకాశ్‌) మంచి వ్యక్తి. ఆయనను ఎవరు చంపారో తెలియదు. కానీ వారిని క్రూరంగా చంపేయండి. తర్వాత ఏ సమస్యా రాదు' అని సీఎం అంటుండగా.. ఓ జర్నలిస్టు చిత్రించారు. ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. సీఎం కుమారస్వామి మాటలను లోకల్ రిపోర్టర్ కెమెరాలో రికార్డు అయ్యింది. అంతే దుమ్ముదుమారం అయ్యింది. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. విమర్శలు ఎక్కువ కావటంతో.. సీఎం కుమారస్వామి వెనక్కి తగ్గారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం మాట మార్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జనతాదళ్‌ (ఎస్)కు చెందిన ఓ కార్యకర్త హత్యకు గురయ్యారు. హొణ్నలగెరె ప్రకాష్ డిసెంబర్ 24 సాయంత్రం కారులో వెళ్తుండగా బైక్‌ పై ఇద్దరు వ్యక్తులు వెంబడించారు. వాళ్లు ప్రకాష్ వాహనాన్ని మద్దూర్‌ దగ్గర అడ్డుకుని కారులోంచి కిందికి దింపి.. దాడికి పాల్పడ్డారు. ప్రకాశ్ చనిపోయారు. హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు.. రెండు హత్య కేసుల్లో నిందితులు. బెయిల్‌ పై బయట తిరుగుతున్నారు. దాడిలో ప్రకాష్ చనిపోయిన విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి.. ఫోన్ లో పోలీసులతో మాట్లాడుతూ దోషులను కనికరం లేకుండా కాల్సి పడేయండి` అంటూ చెప్పారు.

సీఎం సినీ ప‌క్కీలో మాట్లాడిన స‌మ‌యంలో వీడియో వైర‌ల్ అయింది. ప్రస్తుతం దుమారం రేపుతున్న ఆ వీడియోపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. 'అది సీఎంగా ఇచ్చిన ఆదేశాలు కావు. హంతకులపై కోపంతో అలా అన్నానంతే. నిందితులు మరో రెండు హత్యకేసుల్లోనూ వాంటెడ్‌ లుగా ఉన్నారు. జైల్లో ఉండేవారు నేడు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు``అని సీఎం అన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News