కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే బీజేపీ అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే యడియూరప్ప సీఎం పీఠాన్ని అధిరోహించేశారు. అయితే ఇక్కడవరకు అంతా బాగానే ఉన్న మంత్రివర్గ ఏర్పాటులో మాత్రం యడియూరప్పకూ తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీలో చాలామంది ఆశావాహులు మంత్రి పదవి ఆశిస్తున్నారు. పైగా 50 మందికి పైగా నేతలు మూడుసార్లు కంటే ఎమ్మెల్యేలు గా గెలిచి ఉన్నారు.
దీంతో యడ్డీ మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావాహుల పేర్ల లిస్ట్ పట్టుకుని గురువారం హస్తినకి వెళ్లారు. వీరిలో కొందరిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేసేందుకు అధిష్టాన పెద్దల అనుమతి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో యడియూరప్ప భేటీ అయ్యారు. అలాగే శుక్రవారం సాయంత్రం అనేక మంది బీజేపీ నాయకులతో సీఎం యడియూరప్ప భేటీ కావాల్సి ఉంది. కానీ సీఎంతో భేటీ అయ్యేందుకు బీజేపీ అగ్రనేతలు సమయం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీపీ నడ్డాతో ముందు అనుకున్న సమావేశం రద్దయింది. అటు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా యడ్డీ భేటీ కావాల్సి ఉంది. అయితే అమిత్ షాతో సమావేశం కూడా వాయిదా పడిందని తెలుస్తోంది. దానికి కారణం మంత్రి పదవి ఆశిస్తున్న వారి లిస్ట్ పెద్దగా ఉండటమే. యడియూరప్ప ముందుగా తయారు చేసుకుని వెళ్లిన జాబితా పరిశీలించిన బీజేపీ హైకమాండ్ మంత్రి వర్గం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ఎందుకంటే యడియూరప్ప సిద్దం చేసిన జాబితాలో చాల మందికి మంత్రి పదవులు ఇవ్వడానికి హైకమాండ్ సిద్దంగా లేదని తెలిసింది.
దీంతో మంత్రి వర్గ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు యడ్డీ సీఎంగా ప్రమాణం చేసి మూడు వారాల పైనే అయింది. కానీ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. ఈ పరిణామంతో కర్ణాటక బీజేపీకి మరింత ఇబ్బంది కలగొచ్చు. ఒకవేళ మంత్రివర్గం ఏర్పాటైనా పదవులు రాని మిగిలిన నేతలనీ ఎలా బుజ్జగిస్తారనేది కూడా కీలకంగా మారనుంది.