అమిత్ షా, తమిళనాడు గవర్నర్..ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడియూరప్పకి కరోనా

Update: 2020-08-02 18:31 GMT
కరోనా చేయిదాటిపోతోందా? దేశంలో పట్టపగ్గాలు లేకుండా విస్తరిస్తోందా? దానిని ఆపడం ప్రభుత్వాల వల్ల కావడం లేదా.? తాజాగా దేశంలోనే నంబర్ 2.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకడంతో ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

దేశంలో పెద్దపెద్ద వాళ్లందరికీ కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఇక ఇదే రోజు తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే కర్ణాటక ముఖ్య మంత్రి బీఎస్. యడియూరప్ప  కి కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది. ఆయనని ఇప్పటికే హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు  .. స్వయంగా ఆయానే ఈ విషయాన్నీ వెల్లడించారు.

ఇప్పటికే ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావుతోపాటు యూపీలో ఓ మహిళా మంత్రి కరోనాతో మృతిచెందారు. దేశంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి అందరికీ వ్యాపిస్తూ దేశంలోని కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం సోకడం ఆందోళన కలిగిస్తోంది.

చూస్తుంటే దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశలోకి వచ్చినట్టే కనిపిస్తోంది. కాదెవరు ఈ కరోనాకు అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. ఇలానే కొనసాగితే దేశంలో వైరస్ రోగులు పెరిగి.. వైద్య చికిత్సలు అందక  అల్లకల్లోలానికి దారితీసే అవకాశాలుంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News