క‌ర్ణాట‌క‌లోనూ తెలంగాణ‌ ప‌రిస్థితే.. కాంగ్రెస్‌కు ఎదురీత త‌ప్ప‌దా?!

Update: 2023-05-14 16:00 GMT
క‌ర్ణాట‌క‌లో అధికారం ద‌క్కించుకున్న కాంగ్రెస్ రేపో మాపో.. ప్ర‌భుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కాంగ్రెస్ నేత‌లు సంతోషాన్ని ఇస్తున్నా.. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మాత్రం బెం బేలెత్తిస్తోంది. గ‌త మార్చిలో.. ఆర్థిక సంవ‌త్స‌రం ఎండింగ్ స‌మ‌యంలో ఏకంగా 15 వేల కోట్ల రూపాయ‌ల‌ను బొమ్మై స‌ర్కారు అప్పుగా తీసుకుంది. వీటిని ఎన్నిక‌ల‌కు ముందు.. వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు ఇచ్చేసిం ది. దీంతో మొత్తం అప్పు 5.3 ల‌క్ష‌ల కోట్లుగా తేలింది.

గ‌త ప్ర‌భుత్వాలు.. ప్ర‌స్తుత బొమ్మై ప్ర‌భుత్వం క‌లిపి.. మొత్తం 5.3 ల‌క్ష‌ల కోట్ల‌ను అప్పుగా చూపిస్తున్నాయి. ఇక‌, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిల‌, మే 5వ తేదీ నాటికి కూడా ప్ర‌భుత్వం 7500 కోట్ల‌ను తీసుకువ‌చ్చిం ది. దీనిని ఎక్క‌డ ఎందుకు ఖ‌ర్చు చేశారో తెలియ‌దు కానీ, ఖ‌జానా మాత్రం ఖాళీ అయింది. సో.. ఇప్పుడు ఖ‌జానాలో చిల్లిగ‌వ్వ‌లేదు. ఇదేవిష‌యాన్ని స్థానిక మీడియా ప్ర‌ధానంగా చ‌ర్చించింది. కాంగ్రెస్ అధికారం చేప‌ట్టే స‌మ‌యానికి.. ఖ‌జానా ఖాళీగా ఉంద‌ని.. ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తార‌నేది ఇక్క‌డి మీడియా ప్ర‌శ్న‌.

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పంచసూత్రాలతో విజ‌యం ద‌క్కించుకుంది.  వీటిలో గృహ జ్యోతి యోజనె.. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందజేయడం. గృహ లక్ష్మి యోజనె.. ఇంటి పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం ఇవ్వడం. అన్న భాగ్య.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 10 కిలోల ఉచిత బియ్యం అందజేయడం. యువ నిధి.. డిగ్రీ చదివిన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా చేసి, ఉద్యోగం రాని వారికి రూ. 1,500 నిరుద్యోగ భృతి. ఉచిత ప్రయాణ... ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.

ఈ హామీల‌ను తొలి కేబినెట్‌లోనే అమ‌లు చేసేలా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. మ‌రోవైపు.. ఖ‌జానాలో నిధులు లేవు. కేంద్రం నుంచి అప్పులు తేవాలంటే.. మోడీ స‌ర్కారు అనుమ‌తి ఉండాలి. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  తెలంగాణ‌లో్ త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్ స‌ర్కారుకు చిల్లిగ‌వ్వ కూడా మోడీ ఇవ్వ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. క‌ర్ణాట‌కలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినా.. ప‌థ‌కాల అమ‌లు మాత్రం కాంగ్రెస్‌కు క‌త్తిమీద సాముగా మార‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Similar News