కరోనా: మాజీ సీఎంకు ఆసుపత్రిలో బెడ్ దొరకడం లేదు!

Update: 2021-04-17 09:50 GMT
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. సామాన్యులకు అస్సలే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. డబ్బుండి పరపతి ఉన్న వారికి రికమండేషన్ పై బెడ్స్ దొరుకుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఓ మాజీ సీఎంకు కూడా ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తాజాగా కరోనా బారినపడ్డారు. మొన్నటిదాకా కర్ణాటక సీఎంగా చక్రంతిప్పిన ఆయనకు అదే రాష్ట్రంలో ఒక్క ఆస్పత్రిలో బెడ్ దొరకని దుస్థితి నెలకొంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

ప్రస్తుత వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫోన్ చేసి బెడ్ ఇప్పించాలని కోరినప్పటికీ ఫలితం మాత్రం కానరాలేదని కుమారస్వామి ట్వీట్ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కల్లోలం చోటుచేసుకుంది. మాజీ సీఎంకే బెడ్ దొరకనంత రద్దీగా ఆస్పత్రులన్నీ మారిపోయాయి.

కొద్దిరోజులుగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కుమారస్వామికి కరోనా సోకింది. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇంటికి వెళ్లకుండా హోటల్ లో ఉంటున్నారు. తాజాగా మణిపాల్ ఆస్పత్రిలో బెడ్ కోసం సంప్రదించారు. అయితే బెడ్స్ ఖాళీగా లేవని వాళ్లు తెలిపారు.

దీంతో వెంటనే కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కు ఫోన్ చేసి బెడ్ ను ఇప్పించాలని కోరారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో బన్నెర్ ఘట్టా రోడ్ లోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఇలా కన్నడనాట మాజీ సీఎంల స్థాయి వ్యక్తులకు కూడా బెడ్స్ దొరకని విధంగా కరోనా విలయతాండవం చేస్తోంది.
Tags:    

Similar News